ఇంటర్ లో ఇక జీఎస్టీ పాఠాలు

ఇంటర్ లో ఇక జీఎస్టీ పాఠాలు

ఇంటర్ సిలబస్ లో మార్పులుచేసి స్టూడెంట్స్​కు జీఎస్టీ పాఠాలు చెప్పాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఫస్టియర్ లో ఆరు, సెకండియర్ లో నాలుగు సబ్జెక్టుల్లో మార్పులు చేయనుంది. వచ్చే విద్యా సంవత్సరం(2019 –20) నుంచి మారిన సిలబస్ అమలులోకి రానుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాఠ్యపుస్తకాల్లో ఇంటర్ బోర్డు ఐదేండ్లకోసారి మార్పులు చేస్తుంది. ఇందులో భాగంగా వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్‌‌‌‌‌‌‌‌ ఫస్టియర్‌‌‌‌‌‌‌‌లోని హ్యూమానిటీస్‌‌‌‌‌‌‌‌, కామర్స్‌‌‌‌‌‌‌‌, ఎకనా మిక్స్‌‌‌‌‌‌‌‌, సివిక్స్‌‌‌‌‌‌‌‌, హిస్టరీ , జియోగ్రఫీతో పాటు పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ సబ్జె్క్టుల సిలబస్‌‌‌‌‌‌‌‌ మారనుంది. సెకండియర్‌‌‌‌‌‌‌‌ లో సెకండ్‌‌‌‌‌‌‌‌ లాంగ్వేజీలోని హిందీ, సంస్కృతం, ఉర్దూ, అరబిక్‌ సబ్జెక్టులు మారనున్నాయి. ఇప్పటికే సిలబస్‌‌‌‌‌‌‌‌ కమిటీ వీటికి తుది మెరుగులు దిద్దింది. జూన్‌‌‌‌‌‌‌‌ నాటికి కొత్త పుస్తకాలు మార్కెట్‌ లోకి రానున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, భౌగోళిక పరిస్థితులు, తెలంగాణ వైభవాన్ని పుస్తకాల్లోకి ఎక్కించారు. దీనికితోడు కొత్తగా కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ, రాజ్యాంగంలో తీసుకొచ్చిన మార్పులు, ఆర్థిక ప్రణాళికలు తదితర వాటిని సిలబస్‌‌‌‌‌‌‌‌లో చేర్చారు. 2020–-21 విద్యా సంవత్సరంలో ఫస్టియర్‌‌‌‌‌‌‌‌ ఫస్ట్‌‌‌‌‌‌‌‌ లాంగ్వేజీ సబ్జెక్టులు, సెకండియర్‌‌‌‌‌‌‌‌ తెలుగు సబ్జెక్టు లో మార్పులు చేయనున్నారు. డిగ్రీ తరహాలో ఇంటర్‌‌‌‌‌‌‌‌లోనూ సివిక్స్‌‌‌‌‌‌‌‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ సబ్జెక్టులు వేర్వేరుగా పెట్టాలని బోర్డు అధికారులు ఆలోచిస్తున్నారు. టెక్నికల్‌‌‌‌‌‌‌‌ సమస్యల కారణంగా వచ్చే ఏడాది ఈ మార్పులను అమలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

సీబీఎస్‌ ఈ మారితేనే సైన్స్‌ లో మార్పులు
జాతీయస్థాయి పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో మార్పులు చేయాలని ఇంటర్‌‌‌‌‌‌‌‌ బోర్డు నిర్ణయించింది. దీంట్లో భాగంగా సీబీఎస్‌‌‌‌‌‌‌‌ఈ సిలబస్‌‌‌‌‌‌‌‌ పుస్తకాలు మారితే, స్టేట్‌ సిలబస్ లోనూ మార్పులు చేస్తామని అధికారులు చెప్తున్నారు. సీబీఎస్‌‌‌‌‌‌‌‌ఈ సిలబస్‌‌‌‌‌‌‌‌ను చివరిసారిగా 2012లో మార్చారు. దీంతో వచ్చే ఏడాది తప్పనిసరిగా మారే అవకాశముంది. అప్పటి వరకూ గణితం, ఫిజిక్స్‌‌‌‌‌‌‌‌, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ సబ్జె్క్టులు మారే అవకాశంలేదు. దేశవ్యాప్తంగా యూనిఫాం సిలబస్‌‌‌‌‌‌‌‌ కోసం వేసిన కమిటీ రెండేండ్ల కిందే రిపోర్టు సమర్పించినా కేంద్రం ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.