తెలంగాణలో 65.67 శాతం పోలింగ్

తెలంగాణలో 65.67 శాతం పోలింగ్

హైదరాబాద్: తెలంగాణలో లోక్ సభ పోలింగ్ శాతాన్ని అధికారికంగా ప్రకటించింది ఈసీ. రాష్ట్రంలో 65.67 శాతం ఓటింగ్ నమోదైనట్లు సీఈవో వికాస్ రాజ్ చెప్పారు. మే 14వ తేదీ మంగళవారం సాయంత్రం వికాస్ రాజ్ ఎన్నికల పోలింగ్ వివరాలను వెల్లడించారు. అత్యధికంగా భువనగిరిలో 76.78 శాతం పోలింగ్ రికార్డు అయ్యిందని తెలిపారు. అత్యల్పంగా హైదరాబాద్ లో 48.48 శాతం నమోదైనట్లు చెప్పారు. నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో అత్యధికంగా 84.25 శాతం... మలక్ పేట అసెంబ్లీ సెగ్మెంట్ లో అతితక్కువగా 42.76 శాతం పోలింగ్ నమోదు అయ్యిందని తెలిపారు. గతేడాది కంటే ఈసారి మూడు శాతం ఓటింగ్ పెరిగిందని చెప్పారు.

పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా పోలింగ్ శాతం వివరాలు:

 • సికింద్రాబాద్- 49.04
 • హైదరాబాద్‌ - 48.48
 • మల్కాజిగిరి - 50.07
 • చేవెళ్ల - 56.50
 • మెదక్‌ - 75.09
 • జహీరాబాద్‌ - 74.63
 • పెద్దపల్లి - 67.87
 • కరీంనగర్‌ - 72.54
 • మహబూబ్‌నగర్‌ - 72.43
 • నాగర్‌ కర్నూల్‌ - 69.46
 • నల్గొండ - 74.02
 • భువనగిరి - 76.78
 • వరంగల్‌ - 68.86
 • మహబూబాబాద్‌ - 71.85
 • నిజామాబాద్‌ - 71.92
 • ఖమ్మం - 76.09
 • ఆదిలాబాద్‌ - 74.03