IND vs BAN: బంగ్లాదేశ్‌ టూర్‌కు టీమిండియా.. హోమ్ షెడ్యూల్ ప్రకటించిన BCB

IND vs BAN: బంగ్లాదేశ్‌ టూర్‌కు టీమిండియా.. హోమ్ షెడ్యూల్ ప్రకటించిన BCB

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు 2026లో తమ దేశ క్రికెట్ షెడ్యూల్ ను శుక్రవారం (జనవరి 2) ప్రకటించింది. ఈ షెడ్యూల్ లో ఈ ఏడాది భారత క్రికెట్ జట్టు వైట్ బాల్ ఫార్మాట్ కోసం బంగ్లాదేశ్ లో పర్యటిస్తుందని BCB తెలిపింది. 2026లో ఇండియాతో పాటు భారతదేశంతో పాటు పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌తో మూడు ఫార్మాట్లలో ద్వైపాక్షిక సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వనుంది. భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ గడ్డపై 2025లో జరగాల్సిన టీ20 సిరీస్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌లో వైట్-బాల్ పర్యటనను రీ  షెడ్యూల్ చేసినట్లు గతంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది.

షెడ్యూల్ ప్రకారం టీమిండియా ఆగస్టు నెలలో బంగ్లాదేశ్ తో మూడు వన్డేలతో పాటు మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ అశాంతి కారణంగానే ఈ సిరీస్ వాయిదా పడినట్టు తెలుస్తుంది. భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో ఈ పర్యటనకు భారత కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో సిరీస్ ను ఇరు జట్ల బోర్డులు వాయిదా వేసినట్టు అధికారికంగా తెలిపారు. మరోవైపు భారత్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు తామెప్పుడూ సిద్ధమేనని బంగ్లాదేశ్‌ క్రికెట్ బోర్డు(బీసీబీ) తెలిపింది.

షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 1న మొదట వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 3, సెప్టెంబర్ 6న వరుసగా రెండు, మూడు వన్డే మ్యాచ్ లు జరుగుతాయి. వన్డే సిరీస్ ముగిసిన తర్వాత సెప్టెంబర్ 9నుంచి టీ20 ప్రారంభమవుతోంది. సెప్టెంబర్ 12.. సెప్టెంబర్ 13 వరుసగా రెండు, మూడు టీ20 మ్యాచ్ కు జరుగుతాయి. చివరిసారిగా టీమిండియా బంగ్లాదేశ్‌లో పర్యటించినప్పుడు.. 1-2 తేడాతో మన జట్టు సిరీస్ ను కోల్పోయారు. బంగ్లాదేశ్‌లో బంగ్లాదేశ్‌తో ఓవరాల్ గా 25 వన్డేలు ఆడితే.. ఆరు ఓడిపోయి, 18 గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. టీ20 విషయానికి వస్తే భారత జట్టుపై బంగ్లాదేశ్ ఒక్క సిరీస్ కూడా గెలలేదు. 

Also Read : పాకిస్థాన్‌తో పాటు ఆ మూడు జట్లు సెమీస్‌కు వెళ్తాయి.. దిగ్గజ క్రికెటర్ జోస్యం

మార్చి 12-16 వరకు జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం పాకిస్తాన్ మార్చి 9న బంగ్లాదేశ్‌కు చేరుకుంటుంది. ఏప్రిల్ 17 నుండి న్యూజిలాండ్.. బంగ్లాదేశ్ లో పర్యటిస్తుంది. మే 2 న ముగిసే ఈ టూర్ లో వన్డే, టీ20 సిరీస్ లు జరుగుతాయి. మే లో రెండు టెస్టుల కోసం బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ పర్యటిస్తుంది. తొలి టెస్ట్ మే 8-12 వరకు.. రెండో టెస్ట్ మే 16-20 వరకు జరుగుతాయి. జూన్ 5న మూడు వన్డేలు ఆడడానికి బంగ్లాదేశ్ లో ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఇండియాతో వైట్ బాల్ సిరీస్ ఉంటుంది. ఏడాది చివర్లో బంగ్లాదేశ్ లో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ పర్యటిస్తుంది.  మొదటి టెస్ట్ అక్టోబర్ 28 నుండి నవంబర్ 1 వరకు.. రెండో టెస్ట్ నవంబర్ 5 నుంచి 9 వరకు జరుగుతుంది.