Nagarjuna : బుల్లితెరపై బిగ్‌బాస్ తెలుగు 9 సునామీ: ఐదేళ్ల రికార్డులు బద్దలు.. రేటింగ్స్‌పై కింగ్ నాగార్జున ఎమోషనల్ పోస్ట్!

Nagarjuna : బుల్లితెరపై బిగ్‌బాస్ తెలుగు 9 సునామీ: ఐదేళ్ల రికార్డులు బద్దలు.. రేటింగ్స్‌పై కింగ్ నాగార్జున ఎమోషనల్ పోస్ట్!

తెలుగు బుల్లితెరపై రియాలిటీ షోలకి బాప్ అనిపించుకునే బిగ్‌బాస్ (Bigg Boss Telugu) మరోసారి తన సత్తా చాటింది. గతేడాది డిసెంబర్‌లో ముగిసిన బిగ్ బాస్ తెలుగు సీజన్-9.. కేవలం ఒక వినోద కార్యక్రమంగానే కాకుండా, సరికొత్త రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. కామనర్ నుంచి సెలబ్రిటీల వరకు సాగిన ఈ ప్రయాణంలో ఊహించని ట్విస్టులు, ఎమోషన్లు ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేశాయి. లేటెస్ట్ గా ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే సాధించిన రేటింగ్స్ చూసి ట్రేడ్ వర్గాలతో పాటు హోస్ట్ నాగార్జున కూడా ఆశ్చర్యపోతున్నారు.

టీవీల్లోనూ, ఓటీటీలోనూ అన్‌బీటబుల్ రికార్డ్!

బిగ్‌బాస్ తెలుగు సీజన్-9 గ్రాండ్ ఫినాలే రేటింగ్స్ పరంగా గత ఐదేళ్ల రికార్డులను తిరగరాసింది. స్టార్ మా (Star Maa) టెలివిజన్ రేటింగ్స్ (TVR)లో ఈ గ్రాండ్ ఫినాలే ఏకంగా 19.6 పాయింట్లు సాధించింది. గత కొన్ని సీజన్లతో పోలిస్తే ఇది అత్యధికం. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ జియో హాట్‌స్టార్ (JioStar) లో కూడా బిగ్‌బాస్ ప్రభంజనం కొనసాగింది. ఫినాలే ఎపిసోడ్‌ను ఏకంగా 285 మిలియన్ నిమిషాల పాటు వీక్షించారు. అంటే బుల్లితెరపైనే కాకుండా స్మార్ట్ ఫోన్లలో కూడా ప్రేక్షకులు బిగ్‌బాస్‌ను విపరీతంగా ఆదరించారని స్పష్టమైంది

కింగ్ నాగార్జున హర్షం

ఈ అద్భుతమైన రికార్డుపై కింగ్ నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన ఆనందాన్ని పంచుకుంటూ.. "UNBEATABLE!! UNREACHABLE!! స్టార్ మాలో 19.6 TVR, జియోస్టార్‌లో 285 మిలియన్ నిమిషాలు. గత ఐదేళ్లలో బిగ్‌బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. ఎమోషన్స్, ప్యాషన్, గొడవలు , మరచిపోలేని జ్ఞాపకాలతో కూడిన సీజన్ ఇది. కంటెస్టెంట్లకు, స్టార్ మా, ఎండెమోల్ షైన్ టీమ్‌కు, ముఖ్యంగా లక్షలాది మంది ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు" అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

 

విజేతగా కామనర్.. రన్నరప్‌గా తనూజ!

ఈ సీజన్ ప్రత్యేకత ఏమిటంటే, ఒక సామాన్యుడు (Commoner) విజేతగా నిలవడం. హౌస్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి తనదైన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకున్న కల్యాణ్ పడాల బిగ్ బాస్ తెలుగు సీజన్-9 ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. సుమారు 100 రోజులకు పైగా పోరాడి భారీ నగదు బహుమతిని గెలుచుకున్నారు. ఇక పాపులర్ నటి తనూజ రన్నరప్‌గా నిలిచి గట్టి పోటీ ఇచ్చింది. టాప్-5లో నిలిచిన డీమాన్ పవన్, ఇమ్మాన్యూయేల్, సంజనా గల్రానీలు కూడా సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు.

సక్సెస్ వెనుక కారణాలు ఇవే..

సీజన్-8 కంటే సీజన్-9లో టాస్కులు మరింత క్లిష్టంగా ఉండటం, నాగార్జున హోస్టింగ్ స్టైల్ మారడం,  వీకెండ్ ఎపిసోడ్లలో కంటెస్టెంట్ల తప్పులను ఎండగట్టడం వంటివి షో సక్సెస్‌కు దోహదపడ్డాయి. ముఖ్యంగా మిడ్-వీక్ ఎలిమినేషన్లు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ప్రేక్షకులలో ఉత్కంఠను రేకెత్తించాయి. వచ్చే సీజన్-10 మీద ఇప్పుడే అంచనాలు పెరిగిపోతున్నాయి.