కల్వకుంట్ల కవిత వాహనాలపై.. భారీగా ట్రాఫిక్ చలాన్స్.. 22సార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన

కల్వకుంట్ల కవిత వాహనాలపై.. భారీగా ట్రాఫిక్ చలాన్స్.. 22సార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట కవిత కాన్వాయ్ ట్రాఫిక్ చలాన్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అనేక సార్లు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినట్లు పోలీస్ రికార్డుల్లో నమోదు అయింది. పెద్ద మొత్తంలో ట్రాఫిక్ చలాన్లు బాకీ పడిన విషయం వెలుగులోకి వచ్చింది. శుక్రవారం (జనవరి 2) శాసన మండలి సమావేశాలకు హాజరైన క్రమంలో ఈ విషయం బయటికి పొక్కింది.

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వాహనాలపై  భారీగా ట్రాఫిక్ చలాన్లు దర్శనమిచ్చాయి. కల్వకుంట కవిత వాహనాలు అనేక సార్లు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినట్లు ట్రాఫిక్ పోలీస్ రికార్డుల్లో నమోదు అయ్యింది. శుక్రవారం శాసన మండలి సమావేశాలకు వచ్చిన కవిత మార్సిడెస్ బెంజ్  కారుపై 6 చలాన్లు ఉన్నట్లు  గుర్తించారు. ఏకంగా 22 సార్లు  ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు ట్రాఫిక్ పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. 

కవిత వాడుతున్న  Lexus 450D పై 16 ట్రాఫిక్ రూల్స్ వాయిలెన్స్ చలాన్స్ ఉన్నట్లు గుర్తించారు.  రెండు వాహనాలపై మొత్తం 17వేల 770 రూపాయల పెండింగ్ చలాన్లు ఉన్నాయి. ఓవర్ స్పీడ్, ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ ఉండటంతో చలాన్లు వేశారు ట్రాఫిక్ పోలీసులు. నిజామాబాద్, కరీంనగర్, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ఈ చలాన్లు ఎక్కువగా నమోదు అయ్యాయి.