అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కావాలని.. సభకు వచ్చి కేసీఆర్ మాట్లాడితే.. బీఆర్ఎస్ పార్టీ బతికి బట్టకడుతుందని.. లేకపోతే పార్టీకి మనుగడ లేదని.. అథోగతి అంటున్నారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ ను ఉరివేయమని అనటం సీఎం రేవంత్ రెడ్డికి కరెక్ట్ కాదని.. ఉద్యమ నాయకుడిపై అలా ఎలా మాట్లాడతారంటూ ఆవేదన వ్యక్తం చేశారు కవిత. కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను చాలా అభ్యంతరకరంగా ఉన్నాయంటూ మీడియా చిట్ చాట్ లో వ్యాఖ్యానించారు కవిత.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ బీఆర్ఎస్ తప్పిదమేనని.. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా జూరాలకు మార్చ వచ్చు కదా అని ప్రశ్నించారు కవిత. ఉద్యమ నాయకుడూ కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కరెక్ట్ కాదన్నారు. రేవంత్ మాటలకు కేసీఆర్ బిడ్డగా తన రక్తం మరిగిపోయిందన్నారు. బబుల్ షూటర్ (హరీష్ రావు )ప్యాకేజీలకు అమ్ముడుపోయాడని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ప్రజల్ని పిచ్చి వాళ్లను చేస్తున్నాయని విమర్శించారు కవిత.
2025 సెప్టెంబర్ 3 న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినా.. ఇంత వరకు తన రాజీనామాను ఆమోదించలేదన్నారు కవిత. ఎందుకు ఆమోదించలేదని అడగడానికే ఇవాళ మండలికి వచ్చినట్లు చెప్పారు కవిత.
