గ్రోక్ AI కంటెంట్ పై నియంత్రణ ఏదీ?..ఎలాన్ మస్క్ కు ఐటీ శాఖ నోటీసులు

గ్రోక్ AI కంటెంట్ పై నియంత్రణ ఏదీ?..ఎలాన్ మస్క్ కు ఐటీ శాఖ నోటీసులు

గ్రోక్ AI చాట్ బాట్ దుర్వినియోగంపై ఎలాన్ మస్క్ కు చెందిన X సోషల్ మీడియా ప్లాట్ ఫాం కు  కేంద్ర ఐటీ శాఖ నోటీసులిచ్చింది. AI ఉత్పత్తి చేసే కంటెంట్ నియంత్రణలో ఏం చర్యలు తీసుకుంటుందో 72 గంటల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది.. లేకుంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. కంటెంట్ నియంత్రణపై కంపెనీ తీసుకున్న చర్యలపై రిపోర్టును కోరింది. తక్షణమే చట్టవిరుద్ధమైన కంటెంట్ ను వెంటనే తొలగించాలని నోటీసులో పేర్కొంది. 

గ్రోక్ AI జనరేటెడ్ కంటెంట్ నియంత్రణలో X సోషల్ మీడియా ప్లాట్ ఫాం కు పూర్తిగా విఫలమైందని ..ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేసుకొని వారి గౌరవం, గోప్యతకు భంగం కలిగేలా కంటెంట్ విస్తృతంగా క్రియేట్ అవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. 

అభ్యంతర కర కంటెంట్ ను నియంత్రించేందుకు అవసరమైన AIగార్డ్ రైల్ లను అమలు చేయాలని, 72 గంటలలోపు తీసుకున్న చర్యల కు సంబంధించిన రిపోర్టును సమర్పించాలని కోరింది. లేకుంటే ఈ ప్లాట్ పాం నిర్వాహకులు, చట్టాన్ని ఉల్లంఘించే యూజర్లపై ఎటువంటి  నోటీసులు లేకుండానే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.