చైనా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ వన్‌ప్లస్ కొత్త 'టర్బో' సిరీస్ ఫోన్లను చైనాలో లాంచ్ చేసేందుకు రెడీ అయింది. 8 జనవరి 2026న వన్‌ప్లస్ టర్బో 6, టర్బో 6V మార్కెట్లోకి విడుదల కానున్నాయి. తక్కువ ధరలో ఎక్కువ పవర్ లేదా బ్యాక్ అప్ కోరుకునే వారి కోసం ఈ ఫోన్లను రూపొందించారు.
స్పెసిఫికేషన్స్
ఈ ఫోన్లలో హైలెట్ ఫీచర్ 9,000mAh బ్యాటరీ. వన్‌ప్లస్ ఫోన్లలో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద బ్యాటరీ. దీనికి తోడు 80W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇచ్చారు. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే గంటల తరబడి వాడుకోవచ్చు.
స్లిమ్ కెమెరా డిజైన్
సాధారణంగా ఫోన్ వెనుక కెమెరాలు బయటకు వచ్చినట్లు ఉంటాయి. కానీ టర్బో 6 సిరీస్‌లో కెమెరా భాగం చాలా సన్నగా కేవలం 1.7mm ఉంటుంది. దీనివల్ల ఫోన్‌ను టేబుల్‌పై పెట్టినప్పుడు నిలకడగా ఉంటుంది.
స్క్రీన్ & పర్ఫార్మెన్స్
ఈ టర్బో 6లో పవర్ ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 చిప్‌సెట్ ఆశించొచ్చు. టర్బో 6Vలో స్నాప్‌డ్రాగన్ 7s Gen 4 ఉండే అవకాశం ఉంది. రెండు ఫోన్లలో అదిరిపోయే AMOLED స్క్రీన్స్ ఉంటాయి. టర్బో 6లో 165Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, ఇది గేమింగ్ ఆడేవారికి చాలా స్మూత్‌గా అనిపిస్తుంది.
ALSO READ : కొత్త ఏడాదిలో కొత్త కార్లు: స్కోడా, మారుతి, మహీంద్రా నుంచి న్యూ మోడల్స్
కెమెరా
రెండు ఫోన్ల వెనుక 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉంటుంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP కెమెరా ఇచ్చారు. OnePlus Turbo 6 డస్ట్ ఇంకా వాటర్ రిసిస్టెంట్ కోసం IP66/IP68/IP69/IP69K రేటింగ్‌లతో వస్తుందని భావిస్తున్నారు.
ధర & లాంచ్
చైనాలో జనవరి 8న సాయంత్రం ఈ ఫోన్స్ విడుదలవుతాయి. మన దేశంలో ఈ ఫోన్లు వన్‌ప్లస్ నార్డ్ 6, నార్డ్ CE 6 పేర్లతో వచ్చే అవకాశం ఉంది. వీటి ధర సుమారు రూ. 30 వేలలో ఉండవచ్చని అంచనా.
