కొత్త ఏడాదిలో కొత్త కార్లు: స్కోడా, మారుతి, మహీంద్రా నుంచి న్యూ మోడల్స్

కొత్త ఏడాదిలో కొత్త కార్లు: స్కోడా, మారుతి, మహీంద్రా నుంచి న్యూ మోడల్స్

కొత్త సంవత్సరం 2026 భారత ఆటోమొబైల్ రంగానికి సరికొత్త హంగులతో స్వాగతం పలుకుతోంది. ముఖ్యంగా జనవరి నెలలో మూడు దిగ్గజ సంస్థల నుంచి అత్యంత ఆసక్తికరమైన కార్లు విడుదల కోసం ఆటో లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం...

1. స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్:
2026 జనవరిలో స్కోడా తన పాపులర్ ఎస్‌యూవీ 'కుషాక్'ను సరికొత్త అప్‌డేట్స్‌తో తీసుకువస్తోంది. దీని డిజైన్‌లో ముఖ్యంగా ప్యానొరామిక్ సన్‌రూఫ్, కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్, కొత్త గ్రిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అంతేకాకుండా.. అంతర్జాతీయ మోడళ్ల తరహాలో ఇందులో ADAS ఫీచర్ వచ్చే అవకాశం ఉంది. ఇది 1.0-లీటర్, 1.5-లీటర్ TSI పెట్రోల్ ఇంజిన్లతో పాత పవర్ కొనసాగించనుంది.

2. మారుతి సుజుకి ఈ-విటారా:
మారుతి సుజుకి నుంచి రాబోతున్న తొలి ఎలక్ట్రిక్ కారు 'ఈ-విటారా'పై భారీ అంచనాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఇది కేవలం నెక్సా షోరూమ్‌లలో మాత్రమే లభిస్తుంది. ఇందులో రెండు రకాల బ్యాటరీ ప్యాక్‌లు ఉంటాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 543 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. ఇక సేఫ్టీ విషయానికి వస్తే.. BNCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్ సాధించింది. ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ADAS వంటి మరిన్ని అధునాతన సేఫ్టీ ఫీచర్లు జోడించబడ్డాయి.

ALSO READ : జీరో డిప్రీసియేషన్ కార్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి..?

3. మహీంద్రా XUV 7XO:
మహీంద్రా తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ XUV700ని రీబ్రాండ్ చేసి 'XUV 7XO' పేరుతో జనవరి 5న విడుదల చేయటానికి సిద్ధం అవుతోంది. ఇది ఇటీవల విడుదలైన XEV 9S నుంచి కొత్త టెక్నాలజీని అప్పు తెచ్చుకుందని చెప్పుకోవచ్చు. డ్యాష్‌బోర్డ్‌పై మూడు స్క్రీన్లు, హర్మాన్ కార్డాన్ మ్యూజిక్ సిస్టమ్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ వంటి లగ్జరీ ఫీచర్లు ఇందులో ఉంటాయి. దీనిని రూ.21వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. అయితే కారు ధరల వివరాలు జనవరి 5న వెల్లడికానున్నాయి.

ఈ మూడు కార్లు కూడా వేర్వేరు విభాగాల్లో పోటీకి సిద్ధమయ్యాయి. మీరు ఎలక్ట్రిక్ వైపు మొగ్గు చూపితే మారుతి ఈ-విటారా, అలాగే లగ్జరీ టెక్నాలజీ కావాలనుకుంటే మహీంద్రా XUV 7XO, స్టైలిష్ పర్ఫార్మెన్స్ కావాలంటే స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ బెస్ట్ ఛాయిస్ అంటున్నారు ఆటో నిపుణులు. అయితే మీ అభిరుచులకు, అవసరాలకు ఏది బాగా సెట్ అవుతుందనుకుంటే దాని గురించి అన్ని విషయాలు తెలుసుకుని కొనుగోలు చేసేయండి కొత్త సంవత్సరం.