ఆధ్యాత్మికం: సంతోషంగా బతకాలంటే ఏంచేయాలి.. గొప్పగా జీవించాలంటే ఎలా ఉండాలో తెలుసా..!

ఆధ్యాత్మికం: సంతోషంగా బతకాలంటే ఏంచేయాలి.. గొప్పగా జీవించాలంటే ఎలా ఉండాలో తెలుసా..!

లాభాల్లోకెల్లా గొప్పది ఏది? మనిషి సజ్జనుడు ఎప్పుడవుతాడు?ఎవరు సంతోషంగా ఉంటారు?ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ధర్మరాజు సమాధానలు చెప్పాడు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . !

పాండవులు అడవిలో వనవాసం చేస్తున్నప్పుడు ఒక బ్రాహ్మణుడు వచ్చి, తన ఆరణి (నిప్పు-వెలిగించే పరికరం) ఒక లేడి కొమ్ముల్లో ఇరుక్కుందని, తెచ్చి ఇవ్వమని అడుగుతాడు. దానికోసం వెళ్లిన నలుగురు తమ్ముళ్లు తిరిగి రారు చివరకు ధర్మరాజు వెళ్తాడు.యక్షుడి రూపంలో ఉన్న యమధర్మరాజు తన ప్రశ్నలకు సమాధానం చెప్పమంటాడు. ఈ ప్రశ్నల్లో చాలా వరకు వ్యక్తిత్వవికాసానికి, ప్రస్తుత సమాజానికి ఉపయోగపడేవే.

ఏం చేయాలి?

మనిషి ఎప్పుడూ ధైర్యాన్ని వదిలిపెట్టకూడదు. కష్టాలు, బాధలు వచ్చినా. సమస్యలు చుట్టు ముట్టినా, దైర్యం తోడు ఉంటే అన్నింటినీ దాటొచ్చు.  అందుకే మనిషికి సహాయపడేది డబ్బు, స్నేహితులు, బందువులు కాదు. మనిషిలో ఉండే ధైర్యమే. ఇదే విషయాన్ని యక్షుడు 'మానవునికి సహాయపదే ఏది" అని అడిగినప్పుడు ధర్మరాజు ధైర్యం" అని చెప్తారు. అలాగే మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అంటే, పెద్దలను గౌరవించాలి.

వాళ్లు చెప్పిన మంచి విషయాలు వినాలి.వాళ్లు తమ అనుభవాల ద్వారా చెప్పి అనేక విషయాలు
తెలుసుకోవాలి. అది జీవితానికి ఉపయోగపడతాయి. అందుకే మనిషి బుద్ధిమంతుడి గా జీవించాలి అంటే పెద్దలను సేవించడం వల్ల అని చెప్తాడు ధర్మరాజు. తృణం కంటే దట్టమైనది ఏది.? అని యుక్తుడు అడిగిన ప్రశ్నకు ధర్మరాజు చింత అని సమాధానం చెప్తాడు.

'చింత' అంటే 'బాధ మనిషి బాధ నుంచి ఎంత తొందరగా కోలుకుంటే అంత మంచిది. దానిలోనే కూరుకుపోతే ..లేకపోతే ఏ పనీ చేయలేడని చెబుతాడు ధర్మరాజు.మనిషి సజ్జనుడు. ఎప్పుడవుతాడు" అని అడిగితే అందుకు దర్మరాజు ఏ మాట మాట్లాడితే.. ఆ పని చేస్తే ఇతరులు బాధపడతారో అవి ఇతరులపట్ల ప్రదర్శించక పోవడమే మంచితనం అని చెప్తాడు.

ఎలా బతకాలి?

యక్షుడి రూపంలో ఉన్న యమధర్మరాజు అడిగే ప్రతి ప్రశ్నలోనూ లాజిక్​ ఉంటుంది. అలాగే ధర్మరాజు చెప్పే సమాధానంలో మనిషి ప్రవర్తనకు కావా ల్సిన సత్యం ఉంటుంది. "లాభాల్లోకెల్లా గొప్పది ఏది? అన్న ప్రశ్నకు డబ్బు...స్థలం... బంగారం అని చెప్పకుండా ఆరోగ్యం' అని చెప్తాడు ధర్మరాజు. ఆరోగ్యం ఉంటే మనిషి సంతోషంగా జీవిస్తాడు.

నిజమైన ఆరోగ్యం కలవాడే ధనవంతుడు. అలాగే సుఖాల్లో గొప్పది ఏది?" అని అడిగితే, సంతోషం అని చెప్పాడు ధర్మరాజు. డబ్బు, పదవి, ఆస్తి... వస్తువులు వల్ల సుఖాలు వస్తాయి కానీ, సంతోషం కాదు.. నిజమైన సుఖం కలిగినప్పుడే సంతోషం.

సంతోషాన్ని ఇచ్చే సుఖమే అసలైన సుఖం అని సంపాదన కోసం కంటే సంతోషంగా ఉండటం అవసరమని తెలియజేస్తుంది ఈ ప్రశ్న, మనుసు కోరికల పుట్ట ఒకటి పోతే, మరొకటి కావాలంటుంది. ఒకదాని తర్వాత ఇంకొకటి సొంతం చేసుకోవాలంటుంది మనసు. అలాంటి మనసును నిగ్రహించకపోతే కష్టాలు తప్పవు.

గొప్పగా ఉన్నారా?

యక్షుడు 'జ్ఞానం అంటే ఏమిటి?" అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ధర్మరాజు 'మంచి చెడ్డలు గుర్తించడమే' అని చెప్తాడు. ప్రతి పనిలో, ప్రతి వ్యక్తిలో మంచి చెడు రెండూ ఉంటాయి. వాటిని తెలుసుకుని, చెడును వదిలేసి, మంచిదాన్ని తీసుకోవడ మే జ్ఞానం. ఇలా చేస్తే మనిషి ఉన్నత విలు వలతో బతకవచ్చు.

దయ అంటే కేవలం తనకు సంబంధించిన వాళ్లతో, తనకు లాభం ఉన్న జీవులతో మాత్రమే బాగా ఉండటం కాదు. ఈ సృష్టిలో ఉన్న ప్రాణుల సుఖాన్ని కోరుకోవడమే దయ అని చెప్తాడు. ధర్మరాజు ప్రతి ఒక్కరూ రోజూ స్నానం చేస్తుంటారు. కానీ స్నానం చేయడం అంటే కేవలం శరీరాన్ని మాత్రమే శుభ్రం చేసు కోవడం కాదు.

మనసులో ఉన్న చెడును కూడా శుభ్రం చేసుకున్నప్పుడే మనిషి స్నానం చేసినట్లని చెప్తాడు ధర్మరాజు. లో పలున్న  నాది", "నేను', 'నేనే గొప్ప లాంటి అహంకారంతో బతకడం అకఙ్ఞా నంలో బతకడమే అని చెప్తాడు ధర్మరాజు. అంతేకాదు ఢంభం కొట్టుకోవడం అంటే ఏమిటి?" అని యక్షుడు అడిగితే, తనగొప్ప తాను చెప్పుకుని పొంగిపోవడమే అని చెప్తాడు.

సంతోషంగా ఉన్నారా?

చాలామంది మేం సంతోషంగా ఉన్నాం అది చెప్పుంటారు. కానీ యక్షుడు ధర్మరాజును 'ఎవరు సంతోషంగా ఉంటారు?" అని అడిగితే, 'అప్పులేనివాడు, ఉన్నదానిలో తృప్తిగా ఉన్నవాడే సంతోషంగా ఉన్నట్టు లెక్క! అని సమాధానం చెప్తాడు. డబ్బు కీర్తి, పదవి వల్ల వచ్చే సుఖాలన్నీ నిజమైన సంతోషాన్ని ఇవ్వవన్న సత్యాన్ని చెప్తాడు.

అలాగే యమ ధర్మరాజు అడిగిన మరో ప్రశ్నకు ధర్మరాజు 'అందరి పొగడ్తలు పొందాలంటే ఒక పనిచేసే ముందే దాని గురించి ఆలోచించాలని చెప్పాడు. ఇలా చేయకపోతే మంచి ఫలితం పొందలేడు. పని కూడా పూర్తి చేయలేదు.. అందరికంటే ఎక్కువ డబ్బు ఉండటం.. ధనవంతుడి కింద లెక్క అది అనుకుంటూ ఉంటారు. కానీ ధర్మరాజు, సుఖం, బాధ, ఇష్టం, అయిష్టం అన్నింటిని సమానంగా తీ సురోగలిగిన వాడే అందరికంటే ధనవంతుడు అని చెప్పారు. ఇలా జీవించ గలిగితే.. నిజమైన సంతోషం సొంతమవుతుంది.

–వెలుగు, లైఫ్​–