Summer Food : పుదీనా వంటకాలు..  వేడికి విరుగుడు.. ఎలా తయారు చేయాలంటే..! 

Summer Food : పుదీనా వంటకాలు..  వేడికి విరుగుడు.. ఎలా తయారు చేయాలంటే..! 

రెగ్యులర్​ వంటకాల్లా కనిపించినా కొన్ని వంటకాల రూటే సెపరేట్​.. ఎప్పుడు తిన్నా భలేగున్నాయి అనక మానరు. వీటితో ఆ ఫుడ్ కు ఘాటైన సువాసనే  కమ్మని రుచీ  పుదీనాకు  సొంతం. ఈ రెండే కాదు ఆరోగ్యానికీ పుదీన చేసే మేలు ఎంతో ఉంటుంది. ముఖ్యంగా వేడికి విరుగుడుగా పని చేసే పుదీనతో ఎన్నో వెరైటీలు తయారు చేసుకోవచ్చు. అలాంటి వాటిలో కొన్ని మీ కోసం. వాటిని ట్రై చేయండి...

పుదీనా చట్నీ తయారీకి  కావలసినవి

  • పుదీన ఆకులు - ఒకటిన్నర కప్పు
  • కొత్తిమీర తరుగు - అర కప్పు
  • పచ్చిమిర్చి–5
  • అల్లం ముక్క - చిన్నది
  • వేగించిన జీలకర్ర - అర టీస్పూన్
  • నిమ్మరసం -అర టీ స్పూన్
  • ఉప్పు- తగినంత
  • జీలకర్ర- పావు టీ స్పూన్
  • చింతపండు గుజ్జు - పావు కప్పు

పుదీనా చట్నీ తయారీ విధానం 

ముందుగా నూనెలో పచ్చిమిర్చిని వేగించి పక్కన పెట్టాలి. కావాలంటే పుదీన ఆకులను కూడా కొద్దిగా వేగించుకోవచ్చు.

తర్వాత మిక్స్ గిన్నెలో పుదీన ఆకులు, పచ్చిమిర్చి ముక్కలు, -కొత్తిమీర తరుగు, అల్లం ముక్క, జీల కర్ర, చింతపండు గుజ్జ, నిమ్మరసం, ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. చివరగా ఆ మిశ్రమాన్ని పోపు పెట్టుకోవాలి

పుదీనా రైస్​ తయారీకి కావలసినవి

 

  • పుదీన ఆకులు - ఒకటిన్నర కప్పు
  • బియ్యం–రెండు కప్పులు
  • ఎండికొబ్బరి తురుము – పావు కప్పు
  • పచ్చిమిర్చి–3
  • ఉల్లిగడ్డ తరుగు - పావు కప్పు
  • అల్లం-వెల్లుల్లి పేస్ట్-1 టీ స్పూన్
  • లవంగాలు–4
  • ఇలాచీలు–4
  • దాల్చిన చెక్క -కొద్దిగా
  • బిర్యానీ ఆకు -కొద్దిగా
  • నెయ్యి - 2 టీ స్పూన్లు
  • ఉప్పు - తగినంత

పుదీనా రైస్​ తయారీ విధానం


ముందుగా కడిగిన బియ్యాన్నిసరిపడా నీళ్లు పోసి నానబెట్టాలి. పుదీనా ఆకులను కూడా బాగా కడిగి... కొబ్బరి తురుము, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పుతో కలిపి మిక్సీలో  మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

తర్వాత స్టవ్ పై గిన్నె లేదా కుకర్ పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక మసాలా దినుసులు వేయాలి. తర్వాత అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ తరుగు వేసి దోరగా వేగించాలి. అందులో పుదీనా మిశ్రమాన్ని వేసి కలపాలి.

ఇది కొద్దిగా మగ్గాక నానబెట్టిన బియ్యం, సరిపడా నీళ్లు పోసి ఒకసారి కలిపి మూత పెట్టాలి. అన్నాన్ని పొడిపొ డిగా ఉడికించాలి. పుదీనా రైస్ ని ఏదైనా చట్నీ లేదా పెరుగుతో సర్వ్​ చేసుకొని తింటే.. సమ్మర్​ సీజన్​లో చాలా హాయిగా ఉంటుంది.  

శరీరం ఎండ వేడిమిని తట్టుకొనేలా చేస్తుంది.  మరి ఇంకెందుకు ఆలస్యం సమ్మర్​ సీజన్​ స్టాటయిందిగా.. పుదీనా రైస్​ తో ఆరోగ్యాన్ని కాపాడుకుందామా మరి..!

 –వెలుగు, లైఫ్​–