మణికొండలో మంజీరా పైప్ లైన్ బ్లాస్ట్ అవ్వడంతో పలు అపార్టుమెంట్ల సెల్లార్లలోకి భారీగా నీరు వచ్చి చేరింది. ఈ క్రమంలో మణికొండ నుంచి షేక్ పేట్ కి వెళ్లే దారిలో రాకపోకలు బంద్ అవ్వడంతో జనం తీవ్ర ఇబ్బంది ఎదుర్కుంటున్నారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. మంగళవారం ( ఫిబ్రవరి 17 ) అర్థరాత్రి మణికొండలో మంజీరా పైప్ లైన్ లీక్ అవ్వడంతో పలు అపార్టుమెంట్ల సెల్లార్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.
ఈ ఘటనపై హైడ్రా, మున్సిపల్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు స్థానికులు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది సెల్లార్లలోని వరద నీటిని క్లియర్ చేస్తున్నారు.
ఈ క్రమంలో పవర్ సప్లైని నిలిపేశారు అపార్టుమెంట్ వాసులు. పైప్ లైన్ నుంచి భారీగా నీరు లీక్ అయ్యి రోడ్డు మీదకు రావడంతో షేక్ పేట్ కి వెళ్లే రోడ్డులో రాకపోకలు బంద్అయ్యాయి, ట్రాఫిక్ జామ్ కారణంగా జనం తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.
