Allu Cinemas: మల్టీప్లెక్స్ బిజినెస్‍లోకి అల్లు అర్జున్.. సంక్రాంతికి కోకాపేటలో గ్రాండ్ ఓపెనింగ్!

Allu Cinemas: మల్టీప్లెక్స్ బిజినెస్‍లోకి అల్లు అర్జున్.. సంక్రాంతికి కోకాపేటలో గ్రాండ్ ఓపెనింగ్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు వెండితెరపైనే కాకుండా వ్యాపార రంగంలోనూ తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. అల్లు అరవింద్ సారథ్యంలోని గీతా ఆర్ట్స్ కుటుంబం, హైదరాబాద్‌లోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కోకాపేట ప్రాంతంలో అత్యాధునిక హంగులతో 'అల్లు సినిమాస్' (Allu Cinemas) మల్టీప్లెక్స్‌ను సిద్ధం చేసింది. కేవలం సినిమా చూడటమే కాకుండా, ఒక లగ్జరీ అనుభూతిని అందించేలా ఈ థియేటర్ నిర్మించారు..

దేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్!

అల్లు సినిమాస్ కేవలం ఒక మల్టీప్లెక్స్ మాత్రమే కాదు. సాంకేతిక పరంగా ఇది ఒక అద్భుతం నిలవబోతోంది. దీని ప్రత్యేకతలు చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఈ మల్టీప్లెక్స్‌లో సుమారు 75 అడుగుల వెడల్పు కలిగిన భారీ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద 'డాల్బీ సినిమా' స్క్రీన్లలో ఒకటిగా నిలవనుంది.  ప్రపంచ స్థాయి విజువల్స్ కోసం డాల్బీ విజన్ 3D ప్రొజెక్షన్ ,  ప్రతి శబ్దాన్ని స్పష్టంగా వినిపించే డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌ను ఇందులో అమర్చారు.  హై-ఎండ్ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని, సోఫా లాంటి అత్యంత సౌకర్యవంతమైన సీటింగ్ , రాయల్ ఇంటీరియర్స్‌తో దీనిని తీర్చిదిద్దారు.

కోకాపేట టార్గెట్‌గా ప్రీమియం ఎంటర్టైన్మెంట్

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నార్సింగి, గండిపేట , కోకాపేట వంటి ఐటీ హబ్స్ , విలాసవంతమైన విల్లాలు ఉన్న ప్రాంతాల్లోని ప్రేక్షకులకు ఈ మల్టీప్లెక్స్ ప్రధాన గమ్యస్థానంగా మారనుంది. ఇప్పటికే అమీర్‌పేటలో 'AAA సినిమాస్' (ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్) ద్వారా విజయాన్ని అందుకున్న బన్నీ, ఇప్పుడు తన స్వంత బ్రాండ్‌తో వస్తున్నారు. తన వ్యాపారాన్ని విస్తరిస్తూ ముందుకువెళ్తున్నారు. 

 అదిరిపోయే ప్రమోషన్స్!

ఈ మల్టీప్లెక్స్ లాంచ్ కోసం అల్లు అర్జున్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. జనవరి మొదటి వారంలోనే అల్లు సినిమాస్ కోసం కొన్ని ప్రత్యేకమైన యాడ్స్ షూటింగ్‌లో బన్నీ పాల్గొనబోతున్నారు. సంక్రాంతి సీజన్‌ను పురస్కరించుకుని జనవరి 13 లేదా 14న అట్టహాసంగా దీనిని ప్రారంభించాలని అల్లు ఫ్యామిలీ ప్లాన్ చేస్తోంది.

అట్లీ మూవీతో మరో సెన్సేషన్!

ఒకవైపు బిజినెస్ పనుల్లో బిజీగా ఉంటూనే, మరోవైపు సినిమాల్లోనూ బన్నీ దూసుకుపోతున్నారు. డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న భారీ బడ్జెట్ సోషల్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో దీపికా పదుకొణే, మృణాల్ ఠాకూర్ వంటి స్టార్ నటీనటులు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.