డాక్టర్, సిబ్బంది నిర్లక్ష్యంతో 5 రోజుల నవజాత శిశువు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.దీంతో బంధువులు కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. మేనేజ్ మెంట్ నిర్లక్ష్యంవల్లే తమ శిశువు చనిపోయిందని ఆరోపించారు. వివరాల్లోకి వెళితే..
ఖమ్మంలోని ముస్తాఫానగర్ కు చెందిన బాలింత లావణ్య డిసెంబర్ 30నర మగశిశువుకు జన్మనిచ్చింది. శిశువు పాలు కక్కుతుండటంతో స్థానిక గాంధీచౌక్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. చికిత్స పొందుతున్న క్రమంలో శిశువు పరిస్థితి మరింత క్షీణించడంతో ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి సిబ్బంది చెప్పారు. దీంతో హుటాహుటిన ఖమ్మ జిల్లా ప్రభుత్వాస్పత్రిలోని మాతా శిశు కేంద్రానికి శిశును తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు.
Also Read : జగిత్యాల జిల్లా: చట్నీలో బల్లి.. 8 మందికి అస్వస్థత
డాక్టర్లు అందుబాటులో లేకపోవడం, వెంటిలేటర్ సౌకర్యం లేకపోవడం, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ శిశువు చనిపోయాడని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. దీంతో శిశువు మృతదేహంతో ప్రైవట్ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పెళ్లైన తొమ్మిదేళ్ల తర్వాత పెట్టిన బిడ్డ నిర్లక్ష్యానికి బలి కావడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. ఆస్పత్రి మేనేజ్ మెంట్ నిర్లక్ష్యం వల్లే శిశువు చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
