భద్రాచలం, వెలుగు : భద్రాచలంలో షెడ్యూల్డ్ కులాల జేఏసీ ఏర్పాటుకు సన్నాహక సమావేశం ఆదివారం జరిగింది. మహనీయుల స్ఫూర్తితో షెడ్యూల్డ్ క్యాస్ట్ జేఏసీ ఏర్పాటు చేయనున్నట్లు పలువురు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం జిల్లాలోని అన్ని కులాలను మేల్కొలిపే విధంగా జేఏసీ పనిచేస్తుందని తెలిపారు.
ఇందుకు యాక్షన్‌ప్లాన్ తయారు చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాదులు అవులూరి సత్యనారాయణ, సాధనపల్లి సతీశ్‌కుమార్, పలు సంఘాల నాయకులు అల్లాడి పౌల్రాజ్, గడ్డం సుధాకర్‌రావు, ఏవీరావు, పూస శ్రీను, రావులపల్లి తిరుపతిరావు, చీదరగడ్డ శేఖర్, కోకిల గాంధీ, కేసుపాక రవి, కోట దిలీప్, తిప్పనపల్లి ఆనందరావు పాల్గొన్నారు.
