ఖమ్మంలోని క్యాంప్ ఆఫీస్లో కాంగ్రెస్ లో చేరిన ఐదుగురు కార్పొరేటర్లు

ఖమ్మంలోని క్యాంప్ ఆఫీస్లో కాంగ్రెస్ లో చేరిన ఐదుగురు కార్పొరేటర్లు
  • 27కు చేరిన కాంగ్రెస్ బలం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందిన ఐదుగురు ఇండిపెండెంట్ కార్పొరేటర్లు కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. ఆదివారం ఖమ్మంలోని క్యాంప్​ఆఫీస్​లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో ఐదుగురు ఇండిపెండెంట్లు కాంగ్రెస్​లో చేరారు. పార్టీలో చేరినవారికి ఆయన కాంగ్రెస్​కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరినవారిలో 1, 13, 34,42,48 డివిజన్ల​ కార్పొరేటర్లు​సీరపు సుగుణ, తలుగు శాంత, బట్టు విజయలక్ష్మి, దున్నపోతుల మణి, ధర్మసోత్​నరేశ్ ఉన్నారు. 

27 కు చేరిన కాంగ్రెస్ బలం..

కొత్తగూడెం మున్సిపల్​కార్పొరేషన్​లో 60 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్​22 సీట్లు గెలుచుకుంది. ఇండిపెండెంట్లుగా గెలిచిన ఆరుగురిలో ఐదుగురు కాంగ్రెస్​లో చేరారు. దీంతో కాంగ్రెస్​బలం 27కే చేరింది. 

నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయండి 

ఖమ్మం రూరల్, వెలుగు : ఏదులాపురం మున్సిపాలిటీలో గెలిచిన కాంగ్రెస్ కౌన్సిలర్లు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన ఏదులాపురం కాంగ్రెస్ కౌన్సిలర్లనను శనివారం ముదిగొండ మండలంలోని లక్ష్మీపురంలోని ఓ రిసార్ట్స్​కు తరలించారు. అక్కడికి వెళ్లిన మంత్రి పొంగులేటిని నూతన కౌన్సిలర్లు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కౌన్సిలర్లు గెలుపు గర్వం నెత్తికి ఎక్కించుకోవద్దని, పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాలని సూచించారు.