ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు అదుపు తప్పి కెనాల్ లో పడింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థుల అరుపులు, కేకలతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది.శుక్రవారం (జనవరి 2) సాయంత్రం ఖమ్మంజిల్లా గణేష్ పహాడ్ గ్రామ శివారులో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే..
Also Read : డాక్టర్ల నిర్లక్ష్యం..5రోజుల శిశువు మృతి..ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన
ఖమ్మం జిల్లా పెనబల్లి మండలం గణేష్ పహాడ్ శివారులో స్కూల్ బస్సు బోల్తాపడింది. మొద్దులగూడెం వివేకానంద స్కూల్ కుచెందిన బస్సు గ్రామ శివారులోకి రాగానే అదుపుతప్పి NSP సబ్ కెనాల్లో పల్టీ కొట్టింది.దీంతో కొంత మంది విద్యార్థులకు తలకు, కంటికి, చేతులకు గాయాలయ్యాయి.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు .. స్థానికుల సాయంతో విద్యార్థులను బయటికి తీశారు. ప్రమాద సమయంలో బస్సులో 107 మంది విద్యార్థులు ఉన్నారు. 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు.
డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు విద్యార్థుల చెబుతున్నారు. ప్రమాద సమయంలో కెనాల్ లో నీళ్లు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పరిమితికి మించి విద్యార్థులతో ప్రయాణిస్తుండడంతోనే అదుపు తప్పి కాలువలో పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
