విరాజ్ అశ్విన్ హీరోగా వినోద్ గాలి దర్శకత్వంలో శరత్ చంద్ర నాయుడు నిర్మిస్తున్న సిరీస్ ‘గుర్తుకొస్తున్నాయి’. ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. శుక్రవారం ఈ మూవీ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌కు అతిథిగా హాజరైన నిర్మాత నవీన్ యెర్నేని టీమ్‌కు బెస్ట్ విషెస్ తెలియజేశారు.
విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ ‘ఇది జ్ఞాపకాల సమాహారం. రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. చూస్తున్నప్పుడు అందరికీ చాలా మంచి జ్ఞాపకాలు గుర్తొస్తాయి’ అని చెప్పాడు. ఇదొక మంచి సోల్ ఫుల్ కంటెంట్ అని, మర్చిపోయినవన్నీ గుర్తు చేసేలా ఉంటుందని డైరెక్టర్ వినోద్ గాలి అన్నాడు.
ప్రొడ్యూసర్ శరత్ చంద్ర మాట్లాడుతూ ‘మన జీవితంలో ఏదో మిస్ అవుతున్నామనే ఫీలింగ్ వుంటుంది. ఇది చూస్తున్నప్పుడు ఏది మిస్ అవుతున్నామో అది గుర్తుకొస్తుంది. అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది’ అని అన్నారు. ఈటీవి విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ, ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి పాల్గొన్నారు.
