రేవంత్ పాలనలో విజన్ లేదు :  హరీశ్రావు

రేవంత్ పాలనలో విజన్ లేదు :  హరీశ్రావు
  • అమెరికాలో ఎన్నారైల మీట్​అండ్​ గ్రీట్​లో హరీశ్​రావు​

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​ పదేండ్ల పాలనతో పంజాబ్​ను మించి తెలంగాణ ధాన్యం ఉత్పత్తి చేసిందని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. ప్రతి రంగంపైనా దృష్టిపెట్టడం వల్లే తెలంగాణ ప్రగతి సాధ్యమైందన్నారు. గురువారం అమెరికాలోని న్యూజెర్సీ హల్దీమౌంట్​లారెల్​లో మీట్​అండ్​ గ్రీట్​ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విజన్​ లేని రేవంత్​ పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. కనీసం ఒక్క ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారని ఆరోపించారు.