టెర్రరిస్టులు, అవినీతిపరులకు ఎలాంటి ప్రైవసీ ఉండదు

టెర్రరిస్టులు, అవినీతిపరులకు ఎలాంటి ప్రైవసీ ఉండదు

రాహుల్ కు కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ కౌంటర్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్య సేతు యాప్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలను కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ తిప్పి కొట్టారు. ఎవరికైతే ఆరోగ్య సేతు యాప్ తో సమస్యలున్నాయో వారు ఆ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవద్దని రవి శంకర్ గట్టిగా బదులిచ్చారు. ఆరోగ్య సేతు యాప్ ఒక ఫ్రెండ్ లాంటిదని విపక్షం అనవసరంగా దాని చుట్టూ లేనిపోని రాద్ధాంతం సృష్టిస్తోందని ఆయన మండిపడ్డారు. రైళ్లలో ప్రయాణిస్తున్న వారికి ఆరోగ్య సేతు యాప్ ను తప్పనిసరి చేశామన్నారు. ప్రయాణికుల్లో కొందరు స్మార్ట్ ఫోన్ యూజర్స్ కాదని.. వారి కోసం ఆరోగ్య సేతు-ఐవీఎస్ ను తీసుకొచ్చామని చెప్పారు. ప్రజలు ఓ మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుందని, ఆ తర్వాత వారు తమ 2జీ ఫోన్లలో దాన్ని సెటప్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. టెర్రరిస్టులు, అవినీతిపరులకు ఎలాంటి ప్రైవసీ ఉండదని మంత్రి దుయ్యబట్టారు.

‘ఆరోగ్య సేతు యాప్ ఒక ప్రైవేటు ఆపరేటర్ ఔట్ సోర్సింగ్ చేస్తోన్న అధునాతన నిఘా వ్యవస్థ. దీనిపై ఎలాంటి సంస్థాగత పర్యవేక్షణ లేదు. దీని వల్ల డేటా సెక్యూరిటీ, ప్రైవసీకి భంగం కలిగే ప్రమాదం ఉంది. సురక్షితంగా ఉండటంలో టెక్నాలజీ మనకు ఉపయోగపడుతుంది. కానీ పౌరులను వారి అనుమతి లేకుండా గుర్తించడానికి ఇది దారి తీయకూడదు’ అని రాహుల్ ట్వీట్ చేశారు. దీనిపై మండిపడుతూ రవి శంకర్ పైవ్యాఖ్యలు చేశారు.