హైదరాబాద్లో భారీ వర్షం.. కూలిన 200 ఏళ్ల నాటి చెట్టు

హైదరాబాద్లో భారీ వర్షం.. కూలిన 200 ఏళ్ల నాటి చెట్టు

హైదరాబాద్ లోని పలు  ఏరియాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్,బంజారహిల్స్, హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి, లింగంపల్లి, కూకట్ పల్లి, ఎర్రగడ్డ, అమీర్ పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్,నాంపల్లి, సికింద్రాబాద్, అల్వాల్, బాల్ నగర్,  బోయిన్ పల్లి, దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్, లో వర్షం దంచి కొడుతోంది.  రోడ్లపై వర్షం నీళ్లు నిలిచిపోవడంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. 

  ఈదురు గాలులకు   టోలిచౌక్   గోల్కొండ ఎండి లైన్స్ లోని 200 సంత్సరాల నాటి చెట్టు కూలిపోయింది. దీంతో  ఓ వ్యక్తికి తలకు గాయాలు కాగా...  4 బైకులు  డామేజ్ అయ్యాయి.

మేడ్చల్ జిల్లా  ఘట్ కేసర్ మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుండటంతో  విద్యుత్ అంతరాయం ఏర్పాడింది. 

 మరో మూడు రోజులు వర్షాలు ఉన్న  నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఇన్ చార్జ్ కమిషనర్ అమ్రపాలి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మ్యాన్ హోల్ లు తెరిచి ఉంచొద్దని హెచ్చరించారు.