ప్రపంచంలో కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చే దేశాలలో భారతదేశం ముందుంటుంది. పేద, ధనిక తేడాల్లేకుండా ప్రతి ఒక్కరు కుటుంబానికి అంతటి ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ వ్యవస్థ తర్వాత మన దేశంలో అందరు ప్రాధాన్యత ఇచ్చేది వివాహ ధర్మానికే అని చెప్పాలి. జీవితంలో పెళ్లి అతి ముఖ్యమైన ఘట్టంగా భావిస్తారు ఇండియన్స్.శత్రువును సైతం పెళ్ళికి ఆహ్వానిస్తాం మనం. అలాంటిది తల్లిదండ్రులు పెళ్లి సమయంలో అందుబాటులో లేకపోతే పెళ్లిని వాయిదా వేయటానికి కూడా వెనకాడం.లక్నోలో జరిగిన ఓ సంఘటన మనం కుటుంబ వ్యవస్థకు, వివాహ ధర్మానికి ఇచ్చే ప్రాధాన్యతను మరోసారి చాటింది.
వివరాల్లోకి వెళితే, తండ్రి కొన ఊపిరితో ICU లో ఉండగా, ఆయన కూతుళ్లు లక్నోలోని ఆస్పత్రిలో పెళ్లిచేసుకున్నారు. జూన్ 22న ముంబైలో వీరి వివాహం జరగాల్సి ఉండగా తండ్రి సూఫీ సయ్యద్ ఛాతీ ఇన్ఫెక్షన్తో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. తండ్రి పరిస్థితిని తెలుసుకున్న కూతుళ్లు డా.దర్శా, తాంజిలా ఆస్పత్రిలో పెళ్లిచేసుకునేందుకు ICUలో ఏర్పాట్లు చేసుకున్నారు. వారి సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకొని తండ్రి ఆశీర్వాదం పొందారు. ఈ ఘటన ద్వారా భారతీయులు కుటుంబ వ్యవస్థకు, వివాహ ధర్మానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో తెలిపింది.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
