Pushpa 2: పుష్ప-2 మరో నాలుగు నెలలు వాయిదా.. కొత్త డేట్ ప్రకటించిన అల్లు అర్జున్

Pushpa 2: పుష్ప-2 మరో నాలుగు నెలలు వాయిదా.. కొత్త డేట్ ప్రకటించిన అల్లు అర్జున్

మూవీ లవర్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్‌ అవెయిటెడ్‌ టాలీవుడ్‌ సినిమా పుష్ప ది రూల్‌ మరో నాలుగు నెలల పాటు వాయిదా పడింది. అందరూ అనుకున్నట్లు ఈ సినిమా ఆగష్టు 15న థియోటర్లలోకి రావడం లేదు. ఏడాది చివరన థియోటర్లలోకి రానున్నట్లు ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ ట్వీట్ చేశారు. 

డిసెంబర్ 06

పుష్ప 2 వాయిదా పడనున్నట్లు గత కొద్దిరోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆగష్టు 15న ఈ చిత్రం రిలీజ్ కావడం లేదని, వాయిదా పడుతోందని సినీ లవర్స్‌ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. చివరకు అదే నిజమైంది. ఈ ఏడాది డిసెంబర్ 06న పుష్ప-2 థియోటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని అల్లు అర్జున్‌ ఎక్స్(ట్విట్టర్) వేదికగా తెలియజేశారు.

పుష్ప పార్ట్ 1 డిసెంబర్ 2021లో విడుదలైంది. అప్పటి నుంచి అల్లు అర్జున్ మరో మూవీ చేయలేదు. సుకుమార్ తో కలిసి పుష్ప సీక్వెల్ పైనే పని చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ వస్తే మూడేళ్లు పూర్తవుతుంది. గతంలో పుష్ప పార్ట్ 1 డేట్ అచ్చోచ్చింది కనుక మేకర్స్ ఆ దిశగా ఆలోచన చేసి ఉండొచ్చన్న టాక్ వినపడుతోంది.