నిర్భయ న్యాయం కోసం హజారే దీక్ష

నిర్భయ న్యాయం కోసం హజారే దీక్ష

శిక్ష ఆలస్యమైతే న్యాయ వ్యవస్థపై నమ్మకంపోతుంది. దిశ నిందితుల ఎన్​కౌంటర్​పై మద్దతుకు కారణమిదే.
నిర్భయకు వెంటనే న్యాయం చెయ్యాలి.. రాలెగావ్​ సిద్ధిలో హజారే మౌన దీక్ష.

పుణె: నిర్భయ కేసులో జాప్యాన్ని నిరసిస్తూ సోషల్​ యాక్టివిస్ట్​ అన్నా హజారే శుక్రవారం నుంచి మౌన దీక్ష చేపట్టారు. స్వగ్రామం రాలెగావ్​ సిద్ధిలో దీక్ష ప్రారంభిస్తూ.. నిర్భయకు వెంటనే న్యాయం జరగాలని ఆయన డిమాండ్​ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానన్నారు. మౌన దీక్ష చేపట్టబోయే విషయాన్ని ప్రధాని మోడీకి ముందే చెప్పానన్నారు. ఈ నెల 20 నుంచి మౌన దీక్ష చేస్తానంటూ ఈ నెల 9న ప్రధానికి లెటర్​ రాసిన విషయాన్ని హజారే గుర్తుచేశారు. ఢిల్లీతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయని ఆయన విచారం వ్యక్తంచేశారు. బాధితులకు న్యాయం జరగడంలో ఆలస్యమైతే ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుందని హజారే చెప్పారు. ఇటీవల హైదరాబాద్​లో జరిగిన దిశ నిందితుల ఎన్​కౌంటర్ కు వచ్చిన ప్రజాస్పందనే దీనికి నిదర్శనమని అన్నారు.