HDFC​ టార్గెట్​: నెలకు 5 లక్షల కొత్త క్రెడిట్​ కార్డులు

HDFC​ టార్గెట్​: నెలకు 5 లక్షల కొత్త క్రెడిట్​ కార్డులు

ఫిబ్రవరి 2022 నాటికి నెలకు 5 లక్షల కొత్త క్రెడిట్​ కార్డులు ఇష్యూ చేయాలని టార్గెట్​గా పెట్టుకుంటున్నట్లు హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ వెల్లడించింది. రాబోయే రెండు నెలల్లోనే గతంలోని నెలకు 3 లక్షల క్రెడిట్​ కార్డుల జారీని అందుకోగలుగుతామనే ధీమాను హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ గ్రూప్​ హెడ్​ పరాగ్​ రావు వ్యక్తం చేశారు. గత 9 నెలల్లో 5 లక్షల మంది డిపాజిట్​ కస్టమర్లు చేరారు  కాబట్టి టార్గెట్​ అందుకోవడం కష్టం కాదని పేర్కొన్నారు. 6 కోట్ల మంది కస్టమర్ల బేస్​కు కిందటి 9 నెలల్లో ప్రతి నెలా 4 లక్షల మంది కొత్త కస్టమర్లు యాడ్​ అయినట్లు చెప్పారు. కస్టమర్లలో కొంత మందిని ప్రీ అప్రూవ్డ్​ కార్డుల కోసం ఇప్పటికే గుర్తించామని, మొత్తం కార్డులలో 80 శాతం కొత్త కస్టమర్లకే జారీ చేస్తున్నామని అన్నారు. డిజిటల్​ బ్యాంకింగ్​లో తరచూ ప్రాబ్లమ్స్​ రావడంతో కొత్త క్రెడిట్​ కార్డులు ఇవ్వకుండా హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​పై  ఆర్​బీఐ ఆంక్షలు పెట్టింది. ఈ ఆంక్షలను కిందటి వారంలో ఎత్తి వేసింది. దీంతో క్రెడిట్​ కార్డుల మార్కెట్లో తన వాటాను మళ్లీ పెంచుకునే ప్రయత్నాలను బ్యాంకు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికీ 1.48 కోట్ల క్రెడిట్​ కార్డులతో హెచ్​డీఎఫ్​సీ బ్యాంకే మార్కెట్​ లీడర్​.  అంతకు ముందున్న 1.54 కోట్ల నుంచి చూస్తే ఆరు లక్షల కార్డులు తగ్గిపోయాయి. క్రెడిట్​ కార్డుల మార్కెట్లో ఎస్​బీఐ రెండో ప్లేస్​లోను, ఐసీఐసీఐ బ్యాంకు మూడో ప్లేస్​లోనూ నిలుస్తున్నాయి.  కొత్త పార్ట్​నర్షిప్​లతో బిజినెస్​ను పెంచుకుంటామని  పరాగ్​ రావు వెల్లడించారు.