Health : షుగర్ పేషెంట్లు.. ఎంత అన్నం తినాలి..

Health : షుగర్ పేషెంట్లు.. ఎంత అన్నం తినాలి..

చాలా మందికి షుగర్ అనగానే అన్నం తినకూడదు.. చపాతీలు మాత్రమే తినాలనే అభిప్రాయం ఉంటుంది. అయితే ఎప్పుడూ చపాతీలే తిన్నా కూడా అనారోగ్యమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. షుగర్ పేషెంట్లు కూడా రెండు పూటలా అన్నం తినొచ్చని.. అయితే దానికి కొంత లిమిట్ ఉందని చెబుతున్నారు.

అన్నంలో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయని.. దీని వల్ల షుగర్ లెవల్స్ పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. అలా అని పూర్తిగా మానేయటం కూడా మంచిది కాదంటున్నారు. పురుషులు అయితే 60 నుండి 75 గ్రాముల అన్నం తీసుకోవచ్చని.. అదే స్త్రీలు అయితే 45 నుంచి 60 గ్రాముల రైస్ తీసుకోవచ్చంటున్నారు. అర క‌ప్పు అన్నంలో 50 గ్రాములు కార్బోహైడ్రేట్స్ ఉంటాయని.. 45 నుంచి 60 గ్రాములు కార్బోహైడ్రేట్స్ ఉన్న అర క‌ప్పు అన్నాన్ని తీసుకోవటం మంచిదంటున్నారు. పాలు, పండ్లు, కూర‌గాయ‌ల‌ను కూడా భోజ‌నంతోపాటు తీసుకోవ‌చ్చని.. రెండో పూట కూడా ఇదే రకమైన ఆహారం తీసుకోవచ్చని సూచిస్తున్నారు. .

షుగర్ పేషెంట్లు సాధార‌ణ బియ్యంతో పాటు ముడి బియ్యంతో వండిన అన్నాన్ని తీసుకోవ‌చ్చు. ముడిబియ్యంలో పోష‌కాలు అధికంగా ఉంటాయి. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ని నియంత్రించ‌డంతోపాటు ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఈ విధంగా వైట్ రైస్, బ్రౌన్ రైస్ త‌క్కువ మోతాదులో తీసుకోవాలి. అంతేకానీ వాటిని తింటే షుగ‌ర్ పెరుగుతుంద‌నే అపోహ‌తో వాటిని తీసుకోవ‌డం పూర్తిగా మానేయ‌కూడ‌దని సలహా ఇస్తున్నారు.

సాధారణంగా మనం తీసుకునే ఆహారమేదైనా సరే ఆరోగ్యానికి మేలు చేసేదై ఉండాలి. అప్పుడే ఆరోగ్యమైన జీవనం గడపవచ్చు. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో కూరగాయలు, పండ్లు, పాలు, మాంసంకు బదులుగా కొన్ని ఇతర ఆహార పదార్ధాలు, ధాన్యాలు, గింజలు, దుంపలు తీసుకోవాలని, అందులో ఉండే కార్బోహైడ్రేట్ల శాతాన్ని కూడా ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు.