బెల్లం నీళ్లతో బరువు తగ్గొచ్చు

బెల్లం నీళ్లతో బరువు తగ్గొచ్చు
ప్రతి రోజూ ఉదయం నిద్ర లేవగానే గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా? అయితే ఈసారి దానికి బదులు బెల్లం నీళ్ళు తాగి చూడండి. ఉదయాన్నే పరగడుపున ఈ నీళ్లు తాగితే రోజంతా ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. పైగా ఈ సీజన్ లో బెల్లం నీళ్లు తాగడం వల్ల బాడీ ఎప్పుడూ హీట్​గా ఉంటుందని ఎక్స్​పర్ట్స్ చెబుతున్నారు. బెల్లంలో విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి.  చల్లటి వాతావరణంలో ఈ నీళ్లు తాగితే జలుబు, దగ్గు లాంటివి కంట్రోల్ అవుతాయి. ఇదేకాదు ఇంకో పెద్ద ఉపయోగం ఉంది అదేంటంటే… పరగడుపున తాగే బెల్లం నీళ్లు బరువు తగ్గించడంలో సాయం చేస్తాయి. ఈజీ డైజెషన్ అవుతుంది. బెల్లంలో ఉండే సి –విటమిన్ గొంతు నొప్పుల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. తయారీ గ్లాసు నీళ్లలో చిన్న బెల్లం ముక్క వేసి మరిగించాలి. బెల్లం కరిగేంతవరకూ నీళ్లు కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగాక స్టవ్ ఆపాలి. నీళ్లు కాస్త గోరువెచ్చగా అయ్యాక ఆ నీళ్లు తాగాలి. ఉదయం లేవగానే ప్రతీ రోజూ ఇలానే గోరువెచ్చని బెల్లం నీళ్లు తాగాలి. బెల్లానికి శరీరాన్ని ఎక్కువగా హీట్ చేసే గుణం ఉంటుంది. అందుకని వారంలో రెండు రోజులు బ్రేక్ ఇచ్చి… వారానికి 5 రోజులు తాగాలి. డయాబెటిక్​ పేషెంట్స్​ డాక్టర్​ సలహా మేరకే ఈ డ్రింక్​ తాగాలి.