హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో ఎండలు తీవ్రరూపం దాల్చాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయి. అత్యధికంగా కార్వాన్‌లో 43.4 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, చాంద్రాయణగుట్టలో 43.2, అంబర్‌పేటలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మలక్‌పేట, అల్వాల్, ఏఎస్ రావు నగర్‌లలో 42.6 డిగ్రీలు నమోదయ్యాయి. ఇతర ప్రాంతాల్లో 41.8 నుంచి 42.5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
వచ్చే 4 నుంచి 5 రోజుల పాటు ఇదే తరహా హీట్‌వేవ్ కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసరమైతే తప్ప ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటకు రావద్దని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రజలకు సూచించింది.
