కృష్ణా జిల్లాలో భారీ వర్షం

కృష్ణా జిల్లాలో భారీ వర్షం

కృష్ణా జిల్లా వ్యాప్తంగా  అకాల వర్షాలు కురుస్తున్నాయి. మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్,  గుడివాడతో పాటు పలు ప్రాంతాల్లోలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం కురుస్తుండటంతో ఒక్క సారిగా వాతావరణం చల్లబడింది. చల్లటి వాతావరణంలో కరోనావైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ ఉందంటున్నారు అధికారులు.  జనం ఇళ్లల్లోంచి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.