హైదరాబాద్ లో దంచి కొడుతున్న వాన

హైదరాబాద్ లో దంచి కొడుతున్న వాన

హైదరాబాద్ భారీవర్షం మరోసారి దంచి కొడుతోంది. ఖైరతాబాద్, లక్డీ కపూల్, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్, హయత్ నగర్, వనస్థలిపుం, హిమాయత్ నగర్, గాంధీ నగర్, నారాయణగూడ, బషీర్ బాగ్, కవాడీ గూడ, ఆబిడ్స్, నాంపల్లిలోనూ భారీ వర్షం పడుతోంది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి.

ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల రోడ్లపైకి నీరు చేరడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు కాలనీలన్నీ నీట మునగడంతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. మరో రెండ్రోజుల పాటు రాష్ట్రంలోని పలుచోట్ల భారీ నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.