సెప్టెంబర్‌‌‌‌ లో 102 ఏళ్ల రికార్డ్ బ్రేక్

సెప్టెంబర్‌‌‌‌ లో 102 ఏళ్ల రికార్డ్ బ్రేక్

ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌లో వానలు కుంభవృష్టి కురిపించాయి. ఎన్నడూ లేనంతగా దంచికొట్టాయి. గత 102 ఏళ్ల రికార్డును తిరగ రాశాయి. ‘సెప్టెంబర్‌‌‌‌’ దెబ్బకు జూన్‌‌‌‌, సెప్టెంబర్‌‌‌‌లో ఈసారి ‘సాధారణం’ అనుకున్న వర్షపాతం కాస్త ఓ మెట్టు ఎక్కి ‘సాధారణం కన్నా ఎక్కువ’ లిస్టులో చేరింది. నార్మల్‌‌‌‌ కేటగిరీ వర్షానికి 9% ఎక్కువ కురిసి అత్యధిక వర్షపాతానికి ఓ పాయింటు దూరంలో ఆగింది.

1917 తర్వాత 2019దే

ఈ సెప్టెంబర్‌‌‌‌లో దేశవ్యాప్తంగా 24.7 సెంటీమీటర్ల వాన పడింది. మామూలు కన్నా 48 శాతం ఎక్కువ కురిసింది. భారత వాతావరణ శాఖ లెక్కల ప్రకారం 1901 నుంచి ఇంత వాన ఎప్పుడూ పడలేదు. 1983లో 25.5 సెంటీమీటర్ల వాన పడినా సోమవారం అతి భారీ వర్షాలు కురవడంతో  ఆ ఏడాది రికార్డును ఈజీగా దాటిపోతుందని అంటున్నారు. గతంలో 1917లో రికార్డు స్థాయిలో 28.5 సెంటీమీటర్ల వాన పడింది. ఆ తర్వాత 2019వ సంవత్సరమే.

మాన్‌‌‌‌సూన్స్‌‌‌‌ ఇంకా తిరగలే

ఈ ఏడాది వర్షాలు స్టార్టయినపుడు జూన్‌‌‌‌లో 33 శాతం లోటుంది. కానీ ఒక్కసారిగా అంతా మారిపోయింది. రెండు నెలలుగా అలుపనేదే లేకుండా రుతుపవనాలు యాక్టివ్‌‌‌‌గా ఉన్నాయి. ఆగస్టులో 10 రోజులు, సెప్టెంబర్‌‌‌‌లో 2 రోజులే సాధారణం కన్నా తక్కువ వాన పడింది. గత 31 ఏళ్లలో ఈ రెండు నెలల్లో ఇంత వర్షం పడ్డ దాఖలాల్లేవు. సోమవారం నాటికి ఈ రికార్డు కూడా దాటి 58 ఏళ్ల రికార్డుకు చేరువ కానుంది. ఆలిండియా యావరేజ్‌‌‌‌ వర్షపాతం 87.7 సెంటీమీటర్లు కాగా ఈసారి 95.6 సెంటీమీటర్లకు చేరింది. రుతుపవనాలు ఇంకా తిరుగుముఖం పట్టలేదు. మరో నాలుగు నుంచి, ఐదు రోజులు వరకు వానలు పడే చాన్స్‌‌‌‌ ఉంది.

హర్యానా, ఢిల్లీ, యూపీల్లో లోటు

సెంట్రల్‌‌‌‌ ఇండియాలో జులైలో 20% లోటు ఉంటే అది సెప్టెంబర్‌‌‌‌ చివరి నాటికి 28 శాతానికి పెరిగింది. దక్షిణ ఇండియాలోనూ ఇదే పరిస్థితి. జులై 19 నాటికి 30% లోటుంటే సెప్టెంబర్‌‌‌‌ చివరికి అది 16% సర్‌‌‌‌ప్లస్‌‌‌‌కు చేరింది. వాయువ్య ఇండియాలోనూ వర్షం బాగానే పడింది. ఆ ప్రాంతంలో కేవలం 3% లోటుంది. కేవలం హర్యానా, ఢిల్లీ, తూర్పు ఉత్తరప్రదేశ్‌‌‌‌లలోనే లోటు వర్షపాతం నమోదైంది.

వాన లెక్క మారింది

వాన కొలతల్లో ఐఎండీ మార్పు చేసింది. లాంగ్‌‌‌‌ పీరియడ్‌‌‌‌ యావరేజ్‌‌‌‌ (ఎల్‌‌‌‌పీఏ) 89 సెంటిమీటర్లను బెంచ్‌‌‌‌ మార్క్‌‌‌‌ను 88 చేసింది.