జంట జ‌లాశ‌యాల‌కు భారీ వ‌ర‌ద‌.. హిమాయ‌త్ సాగ‌ర్ 2 గేట్లు ఎత్తివేత‌

జంట జ‌లాశ‌యాల‌కు భారీ వ‌ర‌ద‌.. హిమాయ‌త్ సాగ‌ర్ 2 గేట్లు ఎత్తివేత‌

భారీ వర్షాలకు హైదరాబాద్ జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లు పూర్తిగా నిండాయి. పై నుంచి వరద వస్తుండటంతో   హిమాయత్‌ సాగర్ రెండు గేట్లు ఎత్తారు జలమండలి అధికారులు..  మొత్తం ఆరుగేట్లు ఎత్తి దిగువకు వదిలి రెండు ఫీట్ల మేరకు 2వేల600 క్యూ సెక్యుల నీటిని విడుదల చేసిన అధికారులు.  2023 జూలై 21 శుక్రవారం సాయంత్రం నుంచి ఇప్పటి వరకు 6 గెట్లను 2 ఫీట్స్ ఎత్తారు జలమండలి అధికారులు.  

రాజేందర్ నగర్ నుండి  హిమాయత్ సాగర్ కు వెళ్లే సర్వీస్ రోడ్ల బ్రిడ్జిపై నుంచి వర్షం నీరు వెళ్తుంది.   టు వీలర్ వాహనాలకు,  పాదచారులకు ఇదే దారి.. పక్కనున్న ఓఆర్ఆర్ బ్రిడ్జి పైకి వెళ్లాలంటే ఫోర్ వీలర్ వాహనాలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది.   తరచూ రాజేంద్రనగర్ యూనివర్సిటీలో పనిచేసే వాళ్లు ఇక రాజేంద్రనగర్ వెళ్లాలంటే  ఐదు కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది..హిమాయత్ నగర్ నుండి రాజేంద్రనగర్ వైపు వెళ్లే ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డును మూసివేశారు అధికారులు.  ఇరువైపుల బారీ‌ కేడ్స్  ఏర్పాటు చేశారు పోలీసులు.  

హిమాయత్ సాగర్ రిజర్వాయర్ గేట్లు ఓపెన్ చేసిన విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో చూడటానికి తరలి వస్తున్నారు. నిండు కుండలా ఉన్న హిమాయత్ సాగర్ చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‌‌రాబోయే రోజుల్లో హైదరాబాద్ కు భారీ వర్ష సూచనలు ఉన్నాయని.. దీంతో మరింత వరద వచ్చే అవకాశం ఉందని.. అప్పుడు గేట్లు ఎక్కువగా తెరుస్తాం అంటున్నారు అధికారులు.