అంబులెన్స్ కు దారిచ్చి అందరి మనసులను గెలుచుకుంటున్నారు

అంబులెన్స్ కు దారిచ్చి అందరి మనసులను గెలుచుకుంటున్నారు

హాంకాంగ్‌: హాంకాంగ్‌ దేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తి నినాదాలు చేస్తున్నారు. లక్షల మంది వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇంతలో చిన్నగా ఎక్కడో అంబులెన్స్‌ సైరన్‌ వినిపించింది. అంతే ఆ నినాదాలను ఆపి మానవతా దృక్పదంతో అంబులెన్స్‌కు దారిచ్చి వాహనం వెళ్లే వరకు మౌనంగా ఉండిపోయారు. హాంకాంగ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం యావత్‌ ప్రపంచం మనసులను గెలిచింది.

చైనాకు నేరస్థులను అప్పగించే బిల్లును వ్యతిరేకిస్తూ వరుసగా రెండో ఆదివారం హాంకాంగ్‌ ప్రజలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. నిరసనకారుల్లో ఒకరు ఎండలో అస్వస్థతకు గురైనాడు. దీంతో అతనిని తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ వచ్చింది. నిరసనకారులతో కిక్కిరిసిన వీధిలోకి అంబులెన్స్‌ రాగానే వారంతా నినాదాలు ఆపి అంబులెన్స్‌కు దారిచ్చారు. వాహనం వెళ్లగానే మళ్లీ తమ ఆందోళన కొనసాగించారు. ప్రస్తుతం ఈ ఘటనను వీడియో తీసి సోష్‌ మీడియాలో పోస్టు చేశారు. దీంతో హాంకాంగ్‌ ప్రజలు ఎంతో క్రమశిక్షణ కలిగిన నిరసనకారులని నెటిజన్లు వీరిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.