నార్సింగి వర్కింగ్ ప్రొఫెషనల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హాట్ ఫేవరేట్

నార్సింగి వర్కింగ్ ప్రొఫెషనల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హాట్ ఫేవరేట్
  •                రోడ్, రైల్ నెట్ వర్క్‌‌తో పెరిగిన డిమాండ్
  •                 ఫ్యూచర్ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు బెస్ట్ లొకేషన్

నార్సింగి.. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని ఉన్న ఈ ఏరియాలో రియల్ ఎస్టేట్ ఊపందుకుంటోంది.  ఒకవైపు ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్, మరో పక్క గోల్కొండ కోట, మూసి నది ప్రవహిస్తున్న ఈ ప్రాంతం కాలుష్యానికి దూరంగా ఉండటం ప్లస్ పాయింట్. ఇక్కడి నుంచి 5, 6 కిలో మీటర్ల దూరంలో గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉన్నందున వర్కింగ్ ప్రొఫెషనల్స్ నార్సింగి వైపు చూస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్), ఇంటర్నల్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్)కు దగ్గరలో ఉన్నందున బడ్జెట్ ఇళ్లతోపాటు విల్లాలు, రెసిడెన్షియల్ హౌసెస్ లాంటి ప్రీమియం హౌసింగ్ కు ఇది ప్రత్యామ్నాయంగా ఉంది.  కోకాపేట, మణికొండ, హిమాయత్ నగర్ కు చేరువగా ఉన్న ఈ ప్రాంతంలో ఫ్లాట్లు, విల్లాలు, రెసిడెన్షియల్ ఇళ్లు, ఓపెన్‌‌‌‌ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి.

రెసిడెన్షియల్ సెగ్మెంట్‌‌కు డిమాండ్

నార్సింగిలో కమర్షియల్ స్పేస్ కంటే రెసిడెన్షియల్ సెగ్మెంట్ కు విపరీతమైన డిమాండ్ ఉంది.  ప్రశాంతమైన వాతావరణం కోరుకునేవారికి ఇదొక బెస్ట్ లోకేషన్. ఎక్కువగా ఐటీ ఉద్యోగులు ఇళ్లు కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతుంటారు. ఇండింపెండెట్ విల్లా ప్రాజెక్టుల నిర్మాణం ఎక్కువగా జరుగుతుంది. నార్సింగి పరిసరాల్లో ఎక్కువగా డబుల్ బెడ్రూం ఇళ్ల కంటే త్రిబుల్ బెడ్రూం అపార్టుమెంట్ల నిర్మాణం జోరుగా ఉంది. ఇప్పటికే 30కిపైగా రెడీ టు ఆక్యుపై ప్రాజెక్టులు మార్కెట్ లో ఉండగా, నిర్మాణ దశలో మరో 20కి పైగా ఉంటే, కొత్తగా మొదలయ్యే ప్రాజెక్టులు మాత్రం రెండుకు మించి లేవు. డబుల్ బెడ్రూం ఇళ్లు రూ. 53 లక్షల నుంచి మొదలవుతుండగా,  త్రిబుల్ బెడ్రూం ఇళ్ల రేటు మాత్రం రూ. 80 లక్షల నుంచి మొదలై రూ. 1.2 కోట్లు పలుకుతున్నాయి. ప్రస్తుతం నార్సింగి మార్కెట్ ధరలు చ. అడుగుకు రూ. 3200 నుంచి రూ. 5800 వరకు ఉండగా ఏరియా, నిర్మాణ సంస్థ, ప్రాజెక్టు డిజైన్ పై ధరలు ఆధారపడి ఉండగా, ఇప్పుడిప్పుడే కమర్షియల్ స్పేస్ కు మార్కెట్ పెరుగుతుండగా, ఇన్వెస్ట్ మెంట్ కోసం ఏదైనా స్థిరాస్తిని కొనుగోలు చేయడానికి నార్సింగి మంచి లాభాలను తెచ్చిపెడుతుందనీ రియాల్టీ నిపుణులు
చెబుతున్నారు.

అందుబాటులో వసతులు

నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు, నార్సింగి- పుప్పాల గూడ రోడ్డు, ఉస్మాన్ సాగర్ రోడ్డుతోపాటు మెహదీపట్నం, గచ్చిబౌలి నుంచి  నార్సింగికి సిటీ బస్సుల సదుపాయం ఉంది. ఇక్కడి నుంచి అరగంటలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకోవచ్చు. మైండ్ స్పేస్ నుంచి ఎయిర్ పోర్టు వరకు ఎయిర్ పోర్టు ఎక్స్ ప్రెస్ మెట్రో కారిడార్ రానుంది. మూడు కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ లో మెట్రో నిర్మాణం చేయనున్నారు. ఇది బయోడైవర్సిటీ జంక్షన్, నానక్ రామ్ గూడ, నార్సింగి, టీఎస్ పోలీస్ అకాడమీ, శంషాబాద్ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు టెర్మినల్ ను కనెక్ట్ చేస్తుంది. నార్సింగిలో ఎస్ఆర్ హైస్కూల్, బ్రిలియంట్ వరల్డ్ స్కూల్, గ్లోబల్ ఎడ్జ్ స్కూల్, యూరో కిడ్స్ లాంటి స్కూళ్లు, వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నారాయణ కాలేజీ లు ఉన్నాయి. ఆస్పత్రులు, మార్కెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.