సిటీలో ఇండ్ల ధరలు పెరుగుతాయంట​

సిటీలో ఇండ్ల ధరలు పెరుగుతాయంట​
  •     నైట్‌ ఫ్రాంక్ ‘ఇండియా బయ్యర్‌‌ సర్వే–2021’ లో వెల్లడి
  •     వచ్చే ఏడాదిలోపు తీసుకుంటామన్న 55 శాతం మంది రెస్పాండెంట్లు

 వచ్చే ఏడాదిలోపు  రెండో ఇంటిని కొనుక్కోవాలని 50 శాతానికి పైగా హైదరాబాదీలు కోరుకుంటున్నారని నైట్ ఫ్రాంక్‌‌‌‌‌‌‌‌ ఇండియా తన సర్వేలో పేర్కొంది. ‘ఇండియా బయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వే–2021’ను కంపెనీ విడుదల చేసింది. కరోనా సంక్షోభం, లాక్‌‌‌‌‌‌‌‌డౌన్ రెసిడెన్షియల్ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌పై ఎటువంటి ప్రభావాన్ని చూపిందో అంచనావేయడానికి కంపెనీ ఈ సర్వే చేసింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ రియల్‌‌‌‌‌‌‌‌ఎస్టేట్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి, సుమారు 80‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాతం మంది రెస్పాండెంట్లు తమ ఇంటి వాల్యూ వచ్చే ఏడాది లోపు  10–19 శాతం వరకు పెరుగుతుందని చెప్పారు. 55 శాతం మంది ఇంకో ఏడాదిలోపు  రెండో ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నామని అన్నారు. ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఇల్లు మారాలనుకుంటే ప్రభావం చూపే అంశాలేవని  నైట్‌‌‌‌‌‌‌‌ ఫ్రాంక్ సర్వే చేసింది. సుమారు 43 శాతం మంది  ఫ్యామిలీ సైజ్‌‌‌‌‌‌‌‌ పెరిగితే ఇల్లు మారతామని చెప్పారని ఈ సర్వే పేర్కొంది. ఈ సర్వే ప్రకారం, ఇంటిని అప్‌‌‌‌‌‌‌‌గ్రేడ్ చేసుకోవడానికి కొత్త ఇంటికి షిప్ట్‌‌‌‌‌‌‌‌ అవుతామని 22 శాతం మంది రెస్పాండెంట్లు పేర్కొన్నారు. అదనంగా ఇంకో ఇల్లు ఉంటే బాగుంటందనే ఉద్దేశంతో కొత్త ఇల్లు తీసుకుంటామని 12 శాతం రెస్పాండెంట్లు తెలిపారు. 

హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దగ్గరలో..

ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇల్లు కొనడంలో లొకేషన్ పరంగా ఎటువంటి అంశాలు ప్రభావితం చేస్తాయనే అంశంపై  నైట్‌‌‌‌‌‌‌‌ఫ్రాంక్ సర్వే చేసింది. 97 శాతం మంది రెస్పాండెంట్లు పచ్చదనం ఉండి, స్పేస్‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా ఉండే ఇంటికి షిఫ్ట్ అవుతామని  పేర్కొన్నారు.  మంచి హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెసిలిటీ ఉండే ఏరియాకు షిఫ్ట్ అవుతామని 91 శాతం మంది రెస్పాండెంట్లు, వర్క్‌‌‌‌‌‌‌‌ప్లేస్‌‌‌‌‌‌‌‌కు దగ్గరలో ఉండే ఏరియాకు షిఫ్ట్ అవుతామని 78 శాతం మంది రెస్పాండెంట్లు పేర్కొన్నారు. మరో ఇంటికి షిఫ్ట్‌‌‌‌‌‌‌‌ అయ్యామని 54 శాతం మంది రెస్పాండెంట్లు పేర్కొన్నారు. ఇల్లు మారిన వారిలో 58 శాతం మంది మాత్రం తాము  ఎక్కువ స్పేస్‌‌‌‌‌‌‌‌ లేదా అవుట్‌‌‌‌‌‌‌‌ డోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పేస్‌‌‌‌‌‌‌‌ కావాలనే ఇల్లు మారామని చెప్పారు. వచ్చే ఏడాది కాలంలో ఇల్లు మారడంలో కరోనా ప్రభావం ఏమైనా ఉంటుందా? అనే ప్రశ్నకు 76 శాతం రెస్పాండెంట్లు ఉండదని సమాధానమిచ్చారు. సిటీలోనే మరో ఇంటికి షిఫ్ట్‌‌‌‌‌‌‌‌ అవ్వడానికి ప్రయారిటీ ఇస్తామని చెప్పుకొచ్చారు. రెండో ఇంటిని తీసుకోవాలనే  ఆలోచనపై కరోనా సంక్షోభం ప్రభావం ఉందని, త్వరలో ఇంకో ఇంటిని తీసుకుంటామని 55 శాతం రెస్పాండెంట్లు చెప్పారని ఈ సర్వే వెల్లడించింది. 54 శాతం మంది రెస్పాండెంట్లు  ఖర్చులు 9 శాతం వరకు పెరుగుతాయని చెప్పారని ఈ సర్వే పేర్కొంది.‘పచ్చదనం ఎక్కువగా ఉండే ఓపెన్ ప్లేస్‌‌‌‌‌‌‌‌లు, మంచి హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్ ఫెసిలిటీ, వర్క్‌‌‌‌‌‌‌‌ప్లేస్‌‌‌‌‌‌‌‌కు దగ్గర్లో ఉండడం వంటి అంశాలు ఇల్లు కొనడంలో హైదరాబాదీ బయ్యర్లపై ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయి.  ఐటీ కంపెనీలు వృద్ధి చెందుతుండడంతో, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌  కీలకమైన రెసిడెన్షియల్‌‌‌‌‌‌‌‌ డెస్టినేషన్‌‌‌‌‌‌‌‌గా కొనసాగుతుంది’ అని నైట్‌‌‌‌‌‌‌‌ ఫ్రాంక్‌‌‌‌‌‌‌‌ ఇండియా చీఫ్‌‌‌‌‌‌‌‌ ఎకనామిస్ట్‌‌‌‌‌‌‌‌ రాజాని సిన్హా అభిప్రాయపడ్డారు.