ఏ బ్యాంకుల నుంచి ఎంత క్యాష్​ తీసుకోవచ్చంటే..

ఏ బ్యాంకుల నుంచి ఎంత క్యాష్​ తీసుకోవచ్చంటే..

బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌, వెలుగు: చాలా మంది బ్యాంకులో ఖాతా తెరిచేటప్పుడు వడ్డీరేట్లు, లిక్విడిటీ, చార్జీల గురించి మాత్రమే చూస్తారు తప్ప విత్​డ్రాయల్స్​ లిమిట్స్‌‌ గురించి పట్టించుకోవడం లేదు. ఇవి కూడా చాలా ముఖ్యమని తెలుసుకోవాలి. లేకపోతే చార్జీల భారం తప్పదు. స్టేట్‌‌ బ్యాంక్‌‌, పంజాబ్‌‌ నేషనల్‌‌ బ్యాంక్‌‌ , ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంకులు ఇటీవల ఏటీఎం/డెబిట్‌‌కార్డుల విత్‌‌డ్రాయల్‌‌ లిమిట్లను మార్చాయి.    స్టేట్‌‌ బ్యాంక్‌‌ .. నాన్-హోమ్ బ్రాంచ్ చెక్,  విత్‌‌డ్రాయల్‌‌ ఫారాల ద్వారా క్యాష్‌‌ విత్‌‌డ్రాయల్‌‌ లిమిట్‌‌ను పెంచింది.  కరోనా సమయంలో కస్టమర్లకు సహాయం చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంది.

1    స్టేట్ బ్యాంక్ : ఈ బ్యాంక్‌‌ ఖాతాదారులు సేవింగ్స్ అకౌంట్ పాస్‌‌బుక్‌‌ లేదా విత్‌‌డ్రా ఫారమ్‌‌ని ఉపయోగించి నాన్-హోమ్ బ్రాంచ్‌‌ల నుండి రోజుకు రూ.25వేల క్యాష్‌‌ను తీసుకోవచ్చు. చెక్ ఉపయోగించి అయితే రూ. లక్ష పొందవచ్చు. థర్డ్ పార్టీ ద్వారా క్యాష్ విత్‌‌డ్రా లిమిట్ (చెక్ ద్వారా మాత్రమే) రూ.50వేలు. 

2    పంజాబ్ నేషనల్ బ్యాంక్: పీఎన్‌‌బీ తన కస్టమర్లకు  ప్లాటినం, క్లాసిక్  గోల్డ్ పేరుతో మూడు రకాల డెబిట్‌‌కార్డులను అందిస్తుంది.  ప్లాటినం డెబిట్ కార్డ్ హోల్డర్లు రోజుకు  రూ. 50 వేల వరకు విత్‌‌డ్రా చేసుకోవచ్చు. వన్‌‌టైం క్యాష్‌‌ విత్‌‌డ్రా లిమిట్‌‌ రూ. 20వేలు.  ఈకామ్‌‌/పీఓఎస్‌‌ కన్సాలిడేట్ లిమిట్‌‌ రూ. 1.25 లక్షల వరకు ఉంటుంది. పీఎన్‌‌బీ క్లాసిక్ డెబిట్ కార్డ్ హోల్డర్లు రోజుకు క్యాష్‌‌ విత్‌‌డ్రా లిమిట్‌‌ రూ. 25వేలు. వన్‌‌టైం క్యాష్‌‌ విత్‌‌డ్రా లిమిట్‌‌ రూ. 20వేల వరకు ఉంటుంది.  ఈకామ్‌‌/పీఓఎస్‌‌ కన్సాలిడేట్ లిమిట్‌‌ రూ. 60వేలు. పీఎన్‌‌బీ గోల్డ్ డెబిట్ కార్డ్ హోల్డర్లు రోజుకు  రూ. 50వేల దాకా తీసుకోవచ్చు. వన్‌‌టైం క్యాష్‌‌ విత్‌‌డ్రా లిమిట్‌‌ రూ. 20వేలు.  ఈకామ్‌‌/పీఓఎస్‌‌ కన్సాలిడేట్ లిమిట్‌‌ రూ. 1.25 లక్షలు. 

3    ఐసీఐసీఐ బ్యాంక్:  ఈ ఏడాది ఆగస్టు  నుండి, ఐసీఐసీఐ బ్యాంక్ విత్‌‌డ్రాయల్స్‌‌ లిమిట్లు మారాయి. బ్యాంకు ఖాతాదారులు హోమ్ బ్రాంచ్‌‌ నుంచి నెలకు రూ.లక్ష వరకు ఉచితంగానే తీసుకోవచ్చు. నాన్-హోమ్ బ్రాంచ్‌‌లో- రోజుకు రూ. 25వేల వరకు క్యాష్‌‌ తీసుకోవచ్చు. ఇందుకు ఎలాంటి ఛార్జీలూ ఉండవు. థర్డ్ పార్టీ లావాదేవీల లిమిట్‌‌ రోజుకు రూ. 25వేలు.

4    హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్:  హెచ్‌‌డీఎఫ్‌‌సీయేతర  ఏటీఎం నుండి రోజుకు రూ. 10 వేల వరకు విత్‌‌డ్రా చేయవచ్చు. హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ ఏటీఎం ద్వారా  డెబిట్ కార్డును ఉపయోగించి రూ. 25వేలు లేదా అంతకంటే ఎక్కువ (మీ వద్ద ఉన్న కార్డు రకాన్ని బట్టి) తీసుకోవచ్చు.  బ్యాంక్ బ్రాంచ్‌‌లోకి వెళ్లి విత్‌‌డ్రా స్లిప్ లేదా చెక్ ఉపయోగించి క్యాష్‌‌ తీసుకోవచ్చు బ్రాంచ్‌‌లు లేదా ఏటీఎంలలో క్యాష్‌‌ డిపాజిట్ చేయవచ్చు.  నాన్-హోమ్ బ్రాంచ్‌‌లో క్యాష్‌‌ విత్‌‌డ్రాయల్స్‌‌ లిమిట్‌‌ రోజుకు రూ.లక్ష.  థర్డ్ పార్టీ క్యాష్‌‌ విత్‌‌డ్రా లిమిట్‌‌ రూ. 50వేలని హెచ్‌‌డీఎఫ్‌‌సీ తెలిపింది.