సికింద్రాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. నిషేధిత ఓపియం, పాపీ స్ట్రా డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడంతో పాటు ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. సికింద్రాబాద్ డీపీఈవో ఆదేశాలతో గురువారం (మే 21) డీటీఎఫ్ బృందం రూట్‌వాచ్ నిర్వహించింది. ఇందులో భాగంగా న్యూ బోయిన్‌పల్లిలోని రివేరా వైన్స్ ఎదుట తనిఖీలు చేపట్టారు.
అనుమానస్పదంగా తిరుగుతోన్న ఓ యువకుడిని తనిఖీ చేయగా.. అతడి వద్ద డ్రగ్స్ పట్టబడ్డాయి. నిందితుడి నుంచి 400 గ్రాముల ఓపియం, 450 గ్రాముల పాపీ స్ట్రాతో పాటు హోండా యాక్టివా, మొబైల్ ఫోన్ సీజ్ చేశారు పోలీసులు. నిందితుడిని రాజస్థాన్‌కు చెందిన పవన్ కుమార్‌గా గుర్తించారు. పరారీలో ఉన్న మరో నిందితుడు హరీష్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై సికింద్రాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
