ఇంటర్​ బోర్డు కాల్ సెంటర్​కు ఎక్కువైన ఫోన్లు  

ఇంటర్​ బోర్డు కాల్ సెంటర్​కు ఎక్కువైన ఫోన్లు  

 

  • లెక్చరర్లు, పేరెంట్స్​, స్టూడెంట్స్​లో  టెన్షన్​
  • రెండ్రోజుల్లో వెయ్యికి పైగా కాల్స్ ​రిసీవ్​ చేసుకున్న సైకాలజిస్టులు

హైదరాబాద్​, వెలుగు: ‘సార్.. ఆఫ్​ లైన్ ​క్లాసులు చెప్పడంలో నాకు మంచి పేరుంది. కానీ, కెమెరాలో చూస్తూ ఆన్ లైన్​ క్లాస్​ తీసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. ఏం చేయాలో సలహా ఇవ్వండి’...
‘ఎన్నడూ లేనిది నా చిన్న కూతురు ఐదు సబ్జెక్ట్​ల్లో ఫెయిలైంది. ఇందులో పేరెంట్స్​గా మా తప్పేమైనా ఉంటుందా? చెప్పండి’... ఇంటర్​బోర్డ్​ స్టూడెంట్ల కోసం ఏర్పాటు చేసిన కాల్​సెంటర్లకు లెక్చరర్లు , పేరెంట్ల నుంచి ఇలాంటి కాల్స్​ఎక్కువగా వస్తున్నాయి. ఎగ్జామ్స్​ టైంలో స్టూడెంట్ల డౌట్లు, మానసిక సమస్యలను క్లియర్ ​చేసి, ఎగ్జామ్స్​ భయం పోగొట్టేందుకు ఇంటర్​బోర్డు  ఏర్పాటు చేసిన  కాల్​సెంటర్​లోని సైకాలజిస్టులకు ఫోన్లు చేస్తున్నారు. లాక్​డౌన్ టైంలో మారిన టీచింగ్​ పద్ధతుల కారణంగా లెక్చరర్లు కూడా బోధనా విషయంలో డౌట్లు వస్తున్నట్టు సైకాలజిస్టులు చెప్తున్నారు. ఇంటర్ ఎగ్జామ్స్ రీవాల్యూయేషన్​ నేపథ్యంలో కాల్​సెంటర్​కు వెయ్యికిపైగా కాల్స్​ వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కాల్స్​ ఎక్కువగా వస్తున్నాయని సైకాలజిస్టులు చెప్తున్నారు. 

లెక్చరర్ల నుంచి ప్రశ్నలు
ఎగ్జామ్స్​ టైమ్​లో ఎప్పుడూ స్టూడెంట్స్​ నుంచి మాత్రమే కాల్స్ వచ్చేవి. ఇప్పుడు లెక్చరర్లు కూడా ఫోన్​చేసి  డౌట్లు అడుగుతున్నారు. తమ సబ్జెక్ట్​లో స్టూడెంట్లు ఎక్కువ ఫెయిల్​ అవుతున్నారని కొందరు, ఆన్​లైన్​ క్లాసుల మెళకువల కోసం ఇంకొందరు.. ఇలా పలు కారణాలతో సైకాలజిస్టుల సలహాల కోసం కాల్స్ ​చేస్తున్నారు. మరింత బాగా టీచింగ్​చేయాలంటే ఏం చేయాలో చెప్పమని అడుగుతున్నారు. ఇలాంటి వారికి సలహాలు ఇస్తూ.. అవసరమైన వారికి కౌన్సెలింగ్ ​కూడా చేస్తున్నట్టు  సైకాలజిస్టులు పేర్కొంటున్నారు. 

పేరెంట్స్ లోనూ ఆందోళన
ఎగ్జామ్స్​లో స్టూడెంట్లు ఫెయిల్​అయినా పేరెంట్స్​లో ఈసారి చాలా మార్పు కనిపిస్తోంది. రోజూ కండ్ల ముందు ఆన్ లైన్​ క్లాస్​లు విన్న పిల్లలు పరీక్షల్లో ఎలా ఫెయిల్ అయ్యారని పేరెంట్స్​అడుగుతున్నారు. ఆన్ లైన్ క్లాసుల వల్లే పిల్లలు ఇబ్బంది పడ్డారని అంటున్నారు. తమ పెంపకంలోనూ ఏవైనా లోపాలున్నాయా?   తమ ప్రవర్తనను ఏమైనా మార్చుకోవాలా?  అని పేరెంట్స్​ అడుగుతున్నట్టు సైకాలజిస్టులు చెప్తున్నారు. 

స్టూడెంట్స్​ నుంచి ఇలా
అన్ని పరీక్షలు బాగానే రాసినా మార్కులు తక్కువ వచ్చాయని కొందరు స్టూడెంట్లు, ఫెయిల్​ అయ్యామని ఇంకొందరు కాల్ ​సెంటర్​కు  ఫోన్​ చేసి ఆవేదన చెందుతున్నారు. అలా అడుగుతుండగా ఏం చెప్పాలో అర్థం కాలేదని సైకాలజిస్టులు అంటున్నారు.  చదివి రాసిన దానికే మార్కులేస్తారని, నిరాశ పడవద్దని తాము సర్ది చెబుతున్నట్లు సైకాలజిస్టులు చెప్పారు. 

కాల్స్ పెరుగుతున్నాయి
రీ వెరిఫికేషన్ కోసం, మార్కులు తక్కువగా వచ్చాయని పేరెంట్స్​, లెక్చరర్ల నుంచి ఎక్కువగా కాల్స్ వస్తున్నాయి. ప్రిపేర్ కానీ పిల్లల్లో మార్కులు తగ్గాయి. వారికి పేరెంట్స్ , లెక్చరర్ల సపోర్ట్​ అవసరం.  బాగా చదివిన వాళ్లు ఎవరూ ఫెయిల్ కాలేదు. రోజూ కాల్స్ ​వస్తుండగా ఇందులో ఎక్కువగా పేరెంట్స్ ,  లెక్చరర్ల కాల్సే ఉన్నాయి. 
- శైలజ, సైకాలజిస్ట్​

పేరెంట్స్​లోనే ఎక్కువగా టెన్షన్  
స్టూడెంట్స్  కంటే పేరెంట్స్​లోనే ఎక్కువ టెన్షన్ ఉంటోంది. క్లాసులు జరిగాయా లేదా అన్నది చూస్తున్నారే కానీ పిల్లలు ఎగ్జామ్స్​కి ప్రిపేర్ ​అయ్యారా అన్నది పట్టించుకోవడం లేదు. ఈ కాంప్లికేషన్​తోనే  పేరెంట్స్​, లెక్చరర్లు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు.  పేరెంట్స్, లెక్చరర్లు ఆందోళన పడకుండా పిల్లల్లో నాలెడ్జ్ పెరిగేలా అవగాహన కల్పించాలి.
- జవహర్ లాల్ నెహ్రూ, సైకాలజిస్ట్

సంప్రదించాల్సిన నెంబర్లు 
డాక్టర్ అనిత - 91549 51704
డాక్టర్ శ్రీ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త - 91549 51703
డాక్టర్ శైల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జ - 91549 51706
డాక్టర్ అనుప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మా - 91549 51687
డాక్టర్ ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జినీ 91549 51695 
డాక్టర్ మజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ ఆలీ - 91549 51977
డాక్టర్ జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాల్ నెహ్రూ - 91549 51699