పళ్ళు ఎత్తుగా ఉన్నాయని ట్రిపుల్ తలాక్

పళ్ళు ఎత్తుగా ఉన్నాయని ట్రిపుల్ తలాక్

త్రిపుల్ తలాక్ ను రద్దుచేస్తూ చట్టం చేసినా.. నగరంలో ఇంకా ట్రిపుల్ తలాక్ వ్యవహారం నడుస్తూనే ఉంది. పళ్ళు ఎత్తుగా ఉన్నాయని పెళ్లయిన మూడు నెలలకే తలాక్ చెప్పాడో ప్రబుద్ధుడు. ముస్తాఫా అనే వ్యక్తికి  రుక్సానా బేగం అనే యువతితో ఈ ఏడాది జూన్ 27 వివాహం జరిగింది. పెళ్లైన కొన్ని రోజులకే రుక్సానా పట్ల అయిష్టంగా ఉంటూ, అదనపు కట్నం కావాలని ఆమెను మానసికంగా హింసించాడు. తాజాగా ఆమె పళ్లు ఎత్తుగా ఉన్నాయని  ట్రిపుల్ తలాక్ చెప్పాడు. దీంతో బాధిత మహిళ తలాక్ చెప్పి వెళ్ళిపోయిన భర్తపై.. కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు కుషాయిగూడ పోలీసులు.

Hyderabad man gives triple talaq to wife for having 'crooked teeth'