మేడిగడ్డకు జస్టిస్ పీసీ ఘోష్.. కుంగిన ఏడో పియర్ పరిశీలన

మేడిగడ్డకు జస్టిస్ పీసీ ఘోష్..  కుంగిన ఏడో  పియర్ పరిశీలన
  •  పరిశీలించిన చంద్రఘోష్ బృందం
  • ఇరిగేషన్ అధికారుల నుంచి వివరాల సేకరణ

 హైదరాబాద్: కాళేశ్వరంపై జస్టిస్ పీ చంద్రఘోష్  నేతృత్వంలో  ఏర్పాటైన ప్రత్యేక కమిషన్ ఇవాళ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించింది. చంద్రఘోష్ తోపాటు మధ్యాహ్నం మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. ఇరిగేషన్ అధికారులతో  సమావేశమై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. కుంగిన ఏడో పియర్ ను పరిశీలించారు. పియర్ కుంగిపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. నిన్న సాయంత్రం ఆయన కోల్‌‌‌‌‌‌‌‌కతా నుంచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు వచ్చారు. 

శంషాబాద్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టులో ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్‌‌‌‌‌‌‌‌సీ అనిల్ కుమార్, డిప్యూటీ ఈఎన్‌‌‌‌‌‌‌‌సీ కె.శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ ఆయన్ను రిసీవ్ చేసుకున్నారు.  తన సతీమణితోపాటు వచ్చిన జస్టిస్ ఘోష్‌‌‌‌‌‌‌‌కు.. తాజ్ కృష్ణలో ఇరిగేషన్ శాఖ బస ఏర్పాటు చేసింది. నిన్న సాయంత్రం ఆయన ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జాతో భేటీ అయ్యారు.

 ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి మరికొన్ని ప్రాథమిక విషయాలను ఆయన అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. ఇవాళ ఉదయమే తన టీం సభ్యులతో కలిసి క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లారు.