మెట్రో రైళ్లో సాంకేతిక లోపం..30 నిమిషాలు నరకం చూసిన ప్రయాణికులు

మెట్రో రైళ్లో సాంకేతిక లోపం..30 నిమిషాలు నరకం చూసిన ప్రయాణికులు

హైదరాబాద్ మెట్రోలో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. తాజాగా మే 8వ తేదీ కూడా మెట్రో రైళ్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మే8వ తేదీ సోమవారం మధ్యాహ్నం సాంకేతిక లోపం తలెత్తడంతో వందలాది మంది ప్రయాణికులు దాదాపు అరగంట పాటు ఇబ్బందలు పడ్డారు. 

హైదరాబాద్ మెట్రో వ్యవస్థలో సమస్య తలెత్తింది. రెడ్ లైన్‌లో మెట్రో ఫ్రీక్వెన్సీకి అంతరాయం ఏర్పడింది.  దీంతో  మియాపూర్ –ఎల్బీనగర్ మధ్య గల  రెడ్ లైన్‌లో రైళ్లు ఆగిపోయాయి.  ఈ  సమస్యను పరిష్కరించడానికి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ 30 నిమిషాల స మయం తీసుకుంది. దీంతో ప్రయాణికులు సుమారు 30 నిమిషాల పాటు నిస్సహాయంగా స్టేషన్లలోనే నిరీక్షించారు.

 కిటకిటలాడిన స్టేషన్లు

సాంకేతిక సమస్యతో  రైళ్లు ఆలస్యంగా రావడంతో సకాలంలో గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ప్లాట్‌ఫారమ్‌లు కిక్కిరిసిపోయాయి. భారీ సంఖ్యలో ప్రయాణీకులు రావడంతో అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో  పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది.