Ram Charan: ఐఏఎస్ చరణ్ ని చూశారా..ఢిల్లీ వేదికగా వైరల్ అవుతున్నాడు

Ram Charan: ఐఏఎస్ చరణ్ ని చూశారా..ఢిల్లీ వేదికగా వైరల్ అవుతున్నాడు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్(Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.

గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. అందులో ఒకటి ప్రెజెంట్ జనరేషన్ కు సంబందించిన ఐఏఎసీ అధికారి పాత్ర కాగా..మరొకటి 80 దశకానికి సంబందించిన పాత్ర. ఈ పాత్రకు లుక్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అప్పటి నుండి సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నాయి. 

తాజాగా రామ్ చ‌ర‌ణ్ న్యూలుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నేడు మే9న ప‌ద్మ అవార్డుల కార్య‌క్ర‌మం కోసం ఢిల్లీ బ‌య‌ల్దేరిన చ‌ర‌ణ్ ఎయిర్ పోర్టులో కెమెరా కంట చిక్కాడు. దీంతో చరణ్ లుక్ వీపరీతంగా ట్రెండ్ అవుతుంది.

ఈ లుక్ ని కనుక గమనిస్తే..సింపుల్ జీన్స్ టీష‌ర్ట్..క్యాజువ‌ల్ బ్లాక్ ప్యాంట్..క‌ళ్ల‌కు న‌ల్ల‌టి క‌ళ్ల అద్దాలు ధ‌రించారు. ఇక హెయిర్ స్టైల్ రెగ్యుల‌ర్ ఫార్మెట్ లో నే ఉంది. ప‌క్క‌ పాపిడి తీసి..మీసాలు సాఫ్ట్ గా పెంచాడు. క్లీన్ షేవ్ లో గెడ్డం లేకుండా  ఉన్నాడు. టాప్ టూ బాట‌మ్ చ‌ర‌ణ్ ని ద‌గ్గ‌ర‌గా ప‌రిశీలిస్తే స్టార్ట్ లుక్ లో క‌నిపిస్తునే..కాస్త ఐఏఎస్ కి ద‌గ్గ‌ర‌గా అనిపిస్తుంది. ఐఏఎస్ రామ్ నందన్గా చరణ్ లుక్ రివీల్ అయ్యేసరికి అభిమానులకి పండుగనే చెప్పుకోవాలి.  
 
పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో సామాజిక అంశాలతో పాటు ప్రేమ, స్నేహం, ప్రతీకారం, నమ్మకద్రోహం వంటి ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తాయట. క్లైమాక్స్ ఆడియన్స్ కు ఫీస్ట్ లా ఉంటుందని, శంకర్ గత చిత్రాలు ఒకే ఒక్కడు,భారతీయుడు, అపరిచితుడు వంటి సినిమాల రేంజ్ ఇంపాక్ట్ ఉంటుందని టాక్. మరి రిలీజ్ తరువాత గేమ్ ఛేంజర్ సినిమా ఎంతవరకు ఆ అంచనాలను అందుకుంటుందో చూడాలి.

ఇక సినిమాలో రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుండగా..శ్రీకాంత్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.