Summer Health : ఎండలో తిరిగినప్పుడు మీ చర్మం నల్లగా, ఎర్రగా మారుతుందా.. ?

Summer Health : ఎండలో తిరిగినప్పుడు మీ చర్మం నల్లగా, ఎర్రగా మారుతుందా.. ?
  • సన్బర్న్ తో జాగ్రత్త

ఈ వేసవిలో బయటకు వస్తే అనేక రకాల చర్మసమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాటిలో ముఖ్యమైంది సన్ బర్న్. వేసవిలో సన్ స్ట్రోకు నివారించడం సాధ్యపడుతుందేమో కానీ, సన్ బర్న్ నుంచి తప్పించుకోవడం మాత్రం కొంచెం కష్టమే. సన్ బర్న్ అంటే ఎండ తీవ్రత వలన చర్మం రంగుతో పాటు టెక్స్టైర్ మారడం.. ఎర్రగా మండుతున్నట్టు అయిపోవడం, లేదా నల్లగా మాడిపో యినట్టు అయిపోవడం.

కొందరికైతే చర్మం ఉబ్బుతుంది కూడా. అంతేకాదు సన్ బర్న్ వలన తలనొప్పితో సహా అనేక సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్య కొందరికి తీవ్రస్థాయిలో ఉంటుంది. అంటే ఎండలో గడిపిన సమయాన్ని బట్టి రెండు నిమిషాల క్రితమే నీళ్లు తాగినా వెంటనే దాహమేస్తుంది. కాసేపట్లోనే గొంతు ఆరిపోయినట్టు అనిపిస్తుంది. తీవ్రమైన అలసట వచ్చి మూర్చ కూడా రావొచ్చు. సన్ బర్న్ వల్ల స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.

తెల్లగా, ఎర్రగా ఉండే వారిలో ఈ ప్రమాదం ఇంకా ఎక్కువ. ఈ సన్ బర్న్ సంరక్షించుకోవాలి అంటే, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఎండ తగలకుండా చూసుకోవాలి. ఆ సమయంలో యూవీ రేస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ సమయంలో సాధ్యమైనంత వరకు బయటకి వెళ్లకుండా ఉండాలి. బయటకు వెళ్లే ప్రతీసారీ సన్ స్కీన్ లోషన్ వాడటం అలవాటు చేసుకో వాలి. దాంతో పాటు రోజూ చన్నీటి స్నానం చేయాలి. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటుండాలి. మంచినీటితో పాటు కొబ్బరినీళ్లు ఇంకా ఉత్తమం.