ఎల్లుండి (మే 24) యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్..అన్ని వసతులు కల్పించాం: హైదరాబాద్ ఇన్చార్జి కలెక్టర్నారాయణరెడ్డి

 ఎల్లుండి (మే 24) యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్..అన్ని వసతులు కల్పించాం:  హైదరాబాద్ ఇన్చార్జి కలెక్టర్నారాయణరెడ్డి

హైదరాబాద్ సిటీ, వెలుగు: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఈ నెల 24న ప్రశాంతంగా నిర్వహించాలని హైదరాబాద్​ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో గురువారం అడిషనల్​కలెక్టర్ జితేందర్ రెడ్డి, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి డీఆర్వో శ్రీధర్, అబ్జర్వర్లు పూజ దుగ్గల్, అశోక్ సింగ్ రాణాతో కలిసి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నగరంలోని 100 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 44,209 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు తెలిపారు.

అన్ని సెంటర్లలో తాగునీరు, టాయిలెట్స్​వంటి మౌలిక వసతులు కల్పించామన్నారు. ప్రతి కేంద్రం వద్ద జామర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎగ్జామ్ పేపర్–1 ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు, పేపర్–2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరుగుతాయన్నారు. యూపీఎస్సీ నిబంధనల ప్రకారం పరీక్ష ప్రారంభానికి 30 నిమిషాల ముందే గేట్లు మూసివేస్తామని, ఉదయం 9 గంటల్లోపు, మధ్యాహ్నం 2 గంటల్లోపు అభ్యర్థులు సెంటర్లకు చేరుకోవాలని సూచించారు.

ఇ–-అడ్మిట్ కార్డు, గుర్తింపు కార్డు లేని వారిని కేంద్రాల్లోకి అనుమతించబోమన్నారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని తెలిపారు. అభ్యర్థుల భద్రత, తనిఖీల కోసం విమెన్, మేల్ పోలీసులను ప్రత్యేకంగా నియమించినట్లు పేర్కొన్నారు. అడిషనల్ డీసీపీ(ట్రాఫిక్) ఆనంద్, ఎస్ బీ డీసీపీ రవీందర్ రెడ్డి, ఏసీపీ(ట్రాఫిక్) కిషన్ రావు, ఎగ్జామ్స్ అబ్వర్వర్లు మహేందర్ రెడ్డిపాల్గొన్నారు.