కోనా.. ఇండియా మార్కెట్ లోకి సరికొత్త ఎలక్ట్రిక్ కారు

కోనా.. ఇండియా మార్కెట్ లోకి సరికొత్త ఎలక్ట్రిక్ కారు

ప్రముఖ కార్ల తయారీ సంస్థ హుందాయ్‌.. సరికొత్త ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ని విడుదల చేసింది. కోనా పేరుతో ఈ కొత్త కారును మార్కెట్ లో లాంచ్ చేసింది. ఫైవ్ సీటర్ సిస్టమ్ కల ఈ కారు ధరను రూ. 25 .3 లక్షలుగా నిర్ణయించింది.  ప్రపంచ వ్యాప్తంగా ఈ కారు రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లతో లభిస్తోంది. 39.2 కిలోవాట్లు, 64 కిలోవాట్లతో పనిచేస్తాయి. ప్రస్తుతం దీనికి అమర్చిన బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 452 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇది 80శాతం ఛార్జింగ్‌ అయ్యేందుకు గంట సమయం చాలు. ఈ కారు  కొనుగోలు చేసే ప్రయాణికులకు ఒక పోర్టబుల్‌ ఛార్జర్‌, ఏసీ వాల్‌ బాక్స్‌ ఛార్జర్లు ఇస్తారు. పోర్టబుల్‌ ఛార్జర్‌ని త్రీ పిన్‌ 15 యాంపియర్స్‌ సాకెట్‌లో పెట్టి మూడు గంటలు టాప్‌ అప్‌ ఛార్జింగ్‌ చేసుకొని 50 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. 7.2కిలోవాట్ల బాక్స్‌ ఛార్జర్‌ ద్వారా గంట టాప్‌ అప్‌ ఛార్జింగ్‌ చేసుకొని 50 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.

కారు మెయిన్ ఫీచర్స్ ఏంటంటే..

  • 7 ఇంచెస్ డిజిటల్ డ్యాష్ బోర్డు
  • హెడ్ అప్ డిస్‌ప్లే
  • వైర్‌లెస్ చార్జింగ్
  • ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్
  • 8 ఇంచెస్ టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
  • ఆండ్రాయిడ్ ఆటో లేదా యాపిల్ కార్‌ప్లే ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.

కారులో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, 6 ఏయిర్ బ్యాగ్స్, ఈబీడీతో కూడిన ఏబీఎస్, హిల్ స్టార్ట్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సర్, రియర్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ లాంటి  సెక్యూరిటీ  ఫీచర్లు ఉన్నాయి.

ఈ కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 9.7 క్షణాల్లోనే అందుకుంటుంది. ఒక సాధారణ ఎస్‌యూవీ కంటే ఇది చాలా ఎక్కువ వేగం. ఈ కారు మొత్తం ఎకో, కంఫర్ట్‌, స్పోర్ట్‌ అనే డ్రైవింగ్‌ మోడ్స్‌లో లభిస్తుంది.