ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో 11 నెలల దిగువకు రిటైల్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్

ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో 11 నెలల దిగువకు రిటైల్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్
  •     అయినా వరుసగా 55వ నెలలోనూ 4 శాతంపైనే

 
న్యూఢిల్లీ:
రిటైల్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్  ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో 11 నెలల కనిష్టానికి దిగొచ్చింది. రిటైల్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌ను కొలిచే కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) కిందటి నెలలో 4.83 శాతంగా రికార్డయ్యింది.  ఈ ఏడాది మార్చిలో సీపీఐ 4.85 శాతంగా ఉంది. రిటైల్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌  11 నెలల కనిష్టానికి పడినా, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ పెట్టుకున్న మీడియం టెర్మ్‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌ (4 శాతం) కంటే పైన వరుసగా 55వ నెలలోనూ నమోదయ్యింది. 

మనీకంట్రోల్‌‌‌‌‌‌‌‌ ఎనలిస్టులు రిటైల్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌ ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో 4.80 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. కిందటి నెలలో ఆహార పదార్థాలు, పానీయాల  ధరలను కొలిచే  ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌ 7.87 శాతం దగ్గర గరిష్ట లెవెల్లోనే కొనసాగుతోంది.  అంతకు ముందు నెలలో ఈ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ 7.68 శాతంగా ఉంది. ఇంధన ధరలను కొలిచే ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ దిగిరావడంతో రిటైల్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ పెట్టుకున్న 2–6 శాతం రేంజ్‌‌‌‌‌‌‌‌లో రికార్డయ్యింది.