IAF ఫైటర్లలో దేశీ రేడియో సిస్టమ్స్

IAF ఫైటర్లలో దేశీ రేడియో సిస్టమ్స్

అభినందన్​ ఘటన నేపథ్యంలో ఐఏఎఫ్​ నిర్ణయం

బాలాకోట్​ పరిణామాల నేపథ్యంలో యుద్ధవిమానాల్లోని రేడియో వ్యవస్థలను మార్చేయాలని ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​ (ఐఏఎఫ్) నిర్ణయించింది. దేశీయ పరిజ్ఞానంతో రూపొందించే సాఫ్ట్​వేర్​ డిఫైన్డ్​ రేడియో సిస్టమ్​లను పెట్టనుంది. ఆ బాధ్యతను డీఆర్​డీవోకు అప్పగించనుంది. వింగ్​ కమాండర్​ అభినందన్​ వర్తమాన్​ విమానం ఫెయిలవడం, బాలాకోట్​ దాడుల వంటి వాటిపై సమీక్షించిన ఎయిర్​ఫోర్స్​, విమానాల్లోని రేడియో వ్యవస్థలను మార్చాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి సూచించింది.

డాగ్​ఫైట్​ టైంలో అభినందన్​ విమానంలోని రేడియో సిస్టమ్​ జామ్​ అయి గ్రౌండ్​ కంట్రోల్​తో సంబంధాలు తెగిపోయాయని నిర్ధారించింది. తమ నివేదికలోని అంశాలను ప్రభుత్వానికి తెలియజేసింది. అభినందన్​ విమానానికి జరిగినట్టు మరే విమానానికి జరగకూడదంటే రేడియో వ్యవస్థలను మార్చాల్సిన అవసరం చాలా ఉందని పేర్కొంది. ఎయిర్​ఫోర్స్​ ప్రతిపాదనకు ఇటీవలే రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. గ్రౌండ్​ కంట్రోల్​తో పైలట్ల కమ్యూనికేషన్​ కట్​ కాకుండా సాఫ్ట్​వేర్​ డిఫైన్డ్​ రేడియో సిస్టమ్​ను అభివృద్ధి చేసే బాధ్యతను డీఆర్​డీవోకు అప్పగించింది.