5 నిమిషాల్లో 90 వేల టికెట్లు సేల్..ఫ్యాన్స్ కోసం మరిన్ని టికెట్లు

5 నిమిషాల్లో 90 వేల టికెట్లు సేల్..ఫ్యాన్స్ కోసం మరిన్ని టికెట్లు

భారత్ పాక్ మ్యాచ్ అంటేనే మజా ఉంటుటంది. చిరకాల ప్రత్యర్థులు తలపడుతుంటే కొదమ సింహాలే కొట్లాడుకున్నట్లు అనిపిస్తుంది. అందుకే ఈ మ్యాచ్ కు అంత ఇంపార్టెన్స్. ఇండియా పాక్ మ్యాచును ప్రత్యక్షంగా చూడాలని ప్రతీ ఒక్క అభిమాని అనుకుంటాడు. అందుకే టికెట్ను కొనుగోలు చేయడానికి ఫ్యాన్స్ పోటీ పడుతుంటారు. 

హాట్ కేకుల్లా అమ్మకం..
త్వరలో జరిగే టీ20 వరల్డ్ కప్లో భారత్ పాక్ తలపడబోతున్నాయి. అక్టోబర్ 23న మెల్ బోర్న్ లో రెండు దేశాల మధ్య మ్యాచ్ జరగబోతుంది.  ఈ మ్యాచ్ కోసం టికెట్స్ విడుదల చేయగా.. హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. కేవలం 5 నిమిషాల్లోనే 90 వేల టికెట్లను ఫ్యాన్స్ దక్కించుకున్నారు. 

అభిమానుల కోసం మరి కొన్ని టికెట్స్
భారత్‌, పాక్‌ మ్యాచ్‌ జరిగే మెల్ బోర్న్ స్టేడియం అతిపెద్దది. ఇక్కడ 90వేల మంది ప్రత్యక్షంగా కూర్చొని మ్యాచును చూడొచ్చు. అయితే  ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం మరో పదివేల మంది నిలబడి ఆటను వీక్షించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో..భారత్ పాక్ టికెట్లను దక్కించుకోలేపోయిన ఫ్యాన్స్ కోసం 4000 వరకు స్టాండింగ్‌ రూమ్‌ ఓన్లీ టికెట్లు విక్రయించాలని  క్రికెట్‌ ఆస్ట్రేలియా నిర్ణయించింది.