మంచి ఐడియా ఉందా? పేటెంట్‌‌‌‌ తీస్కోవాలె

మంచి ఐడియా ఉందా? పేటెంట్‌‌‌‌ తీస్కోవాలె

బిజినెస్‌‌‌‌‌‌‌‌డెస్క్‌‌‌‌‌‌‌‌, వెలుగు:  చ్చా..ఈ స్టార్టప్‌‌‌‌‌‌‌‌ ఐడియా నాకు కూడా వచ్చిందే, కానీ ఈ ఆలోచనను వాడుకోలేకపోయా? అని ఎప్పుడైనా భాదపడ్డారా?  ప్రస్తుత సమాజంలో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ (ఐపీ) కి ఎక్కువ ప్రాధాన్యం ఉంది. కంపెనీలు, స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు, ఇండివిడ్యువల్స్ ఎవరైనా ఇనొవేటివ్‌‌‌‌‌‌‌‌గా ఉండి, సొసైటీకి, తమ గ్రోత్‌‌‌‌‌‌‌‌కు ఉపయోగపడే ఆలోచన వచ్చిందంటే వెంటనే దానిపై లీగల్‌‌‌‌‌‌‌‌ హక్కులు పొందడం బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. దీంతో ఆ ఆలోచనను ఇంకెవరూ కాపీ కొట్టకుండా ఉంటుంది. ఈ లీగల్ హక్కును పొందడానికి పేటెంట్‌‌‌‌‌‌‌‌ తీసుకోవాల్సి ఉంటుంది. పేటెంట్ పొందడం చాలా లాంగ్ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌. ఇన్వెన్షన్‌‌‌‌‌‌‌‌ లేదా ఐడియా ఇండస్ట్రియల్‌‌‌‌‌‌‌‌గా వాడుకోవచ్చా, కొత్తగా ఉందా? లేదా?, ఇప్పుటికే ఈ ఇన్వెన్షన్‌‌‌‌‌‌‌‌పై ఎవరైనా పేటెంట్స్‌‌‌‌‌‌‌‌ తీసుకున్నారా? వంటి అంశాలను చెక్ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి పేటెంట్‌‌‌‌‌‌‌‌ పొందితే ఇన్వెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తన ఇన్వెన్షన్‌‌‌‌‌‌‌‌ను వాడుకోవచ్చు, అమ్ముకోవచ్చు. సాధారణంగా ఇండియన్ పేటెంట్ హౌస్‌‌‌‌‌‌‌‌ 20 ఏళ్లకు పేటెంట్‌‌‌‌‌‌‌‌ను  గ్రాంట్ చేస్తోంది. తర్వాత ఆ ఇన్వెన్షన్‌‌‌‌‌‌‌‌ను ఎవరైనా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇండియాలో పేటెంట్‌‌‌‌‌‌‌‌ కోసం ఎలా అప్లయ్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

ఇన్వెన్షన్‌‌‌‌‌‌‌‌పై క్లారిటీ..

పేటెంట్ కోసం అప్లయ్ చేసేముందే ఇన్వెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తమ ఇన్వెన్షన్స్‌‌‌‌‌‌‌‌పై ఒక క్లారిటీ ఉండాలి. వీలున్నంత ఇన్‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్‌‌‌‌‌‌‌‌ను సేకరించాలి.  ఈ ఇన్వెన్షన్‌‌‌‌‌‌‌‌ ఏ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ కిందకు వస్తుంది? అడ్వాంటేజ్‌‌‌‌‌‌‌‌లు ఏంటి? ఇప్పటికే ఉన్న ప్రాబ్లమ్స్‌‌‌‌‌‌‌‌ను ఎలా మెరుగుపరచగలదు? వంటి అంశాలపై అవగాహన ఉండాలి. పేటెంట్స్ చట్టంలోని సెక్షన్‌‌‌‌‌‌‌‌ 3 బట్టి అన్ని ఆలోచనలు, ఇన్వెన్షన్లకు పేటెంట్ ఇవ్వరు. కొన్నింటికి మాత్రమే పేటెంట్ హక్కు దక్కుతుంది. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
ముందెవరికైనా పేటెంట్ దక్కిందా?
పేటెంట్‌‌‌‌‌‌‌‌కు అప్లయ్ చేసేముందే ఇంకెవరైనా తమ లాంటి ఆలోచనకు పేటెంట్ తీసుకున్నారో లేదో అప్లికెంట్లు తెలుసుకోవాలి. దీని కోసం సెర్చ్ చేయాలి. ఎందుకంటే  పేటెంట్ దక్కాలంటే ఇన్వెన్షన్‌‌‌‌‌‌‌‌  కొత్తగా ఉండాలి. తమ ఇన్వెన్షన్‌‌‌‌‌‌‌‌కు దగ్గరగా ఉన్న పేటెంట్లను గమనిస్తే  అప్లికెంట్లకు తమ ఇన్వెన్షన్‌‌‌‌‌‌‌‌పై ఒక క్లారిటీ వస్తుంది. ఇలాంటివేవి చేయకుండా డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా కూడా పేటెంట్‌‌‌‌‌‌‌‌ కోసం అప్లయ్ చేసుకోవచ్చు. కానీ, మన లాంటి ఆలోచనకు ఇంకెవరైనా పేటెంట్ తీసుకున్నారా? లేదా? మార్కెట్‌‌‌‌‌‌‌‌లో ఎలాంటి పేటెంట్స్ ఉన్నాయి? వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవడం బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.  తర్వాత పేటెంట్‌‌‌‌‌‌‌‌ అప్లికేషన్‌‌‌‌‌‌‌‌ను రెడీ చేసుకోవాలి. ఈ అప్లికేషన్‌‌‌‌‌‌‌‌లో ఇన్వెన్షన్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన బ్యాక్‌‌‌‌‌‌‌‌గ్రౌండ్‌‌‌‌‌‌‌‌, డిస్క్రిప్షన్‌‌‌‌‌‌‌‌, క్లయిమ్స్‌‌‌‌‌‌‌‌ వంటి అంశాలను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్వెన్షన్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన విషయాలు కాబట్టి, ఫైల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
అప్లికేషన్‌‌‌‌‌‌‌‌ను ఫైల్ చేయాలి..
డ్రాఫ్ట్ అప్లికేషన్‌‌‌‌‌‌‌‌ను ఫామ్‌‌‌‌‌‌‌‌1 తో కలిపి ప్రభుత్వ పేటెంట్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో ఫైల్ చేయాలి. పేటెంట్ అప్లికేషన్ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఒక రిసీట్ జనరేట్ అవుతుంది. ఒకవేళ ఇన్వెన్షన్‌‌‌‌‌‌‌‌  స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌ స్టేజ్‌‌‌‌‌‌‌‌లో   ఉంటే ఫామ్‌‌‌‌‌‌‌‌ 2 కింద ప్రొవిజనల్‌‌‌‌‌‌‌‌ పేటెంట్ అప్లికేషన్‌‌‌‌‌‌‌‌ను ఫైల్ చేయొచ్చు. ప్రొవిజనల్ అప్లికేషన్‌‌‌‌‌‌‌‌ను ఫైల్ చేయడం వల్ల పేటెంట్ పొందడంలో టైమ్‌‌‌‌‌‌‌‌ కలిసొస్తుంది. తమ ఇన్వెన్షన్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన స్పెసిఫిక్ డిటైల్స్‌‌ను ఫైల్ చేయడానికి  అప్లికేషన్‌ ఫైల్ చేసినప్పటి నుంచి12 నెలల వరకు టైమ్ ఉంటుంది. స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు, చిన్న కంపెనీలయితే పేటెంట్‌ కోసం సబ్మిట్‌  చేసినప్పుడే ఫామ్‌‌‌‌‌‌‌‌ 28 ను కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.   

పరిశీలన తర్వాతే..
పేటెంట్ స్పెసిఫికేషన్స్‌‌‌‌‌‌‌‌ను ఫైల్ చేసిన డేట్‌‌‌‌‌‌‌‌ నుంచి 18 నెలల తర్వాత పేటెంట్ అప్లికేషన్‌‌‌‌‌‌‌‌ను పబ్లిష్ చేస్తారు. అప్లికేషన్‌‌‌‌‌‌‌‌ను పబ్లిష్ చేయడానికి ఎటువంటి  రిక్వెస్ట్‌‌‌‌‌‌‌‌లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ 18 నెలలు వెయిట్ చేయలేమనుకుంటే మాత్రం ఫామ్‌‌‌‌‌‌‌‌ 9 తో పాటు కొంత ఫీజు కడితే, నెలరోజుల్లోనే పేటెంట్ అప్లికేషన్‌‌‌‌‌‌‌‌ను పబ్లిష్ చేస్తారు. పేటెంట్ అప్లికేషన్‌‌‌‌‌‌‌‌ను ఆటోమెటిక్‌‌‌‌‌‌‌‌గా పబ్లిష్ చేస్తారు. కానీ, అప్లికేషన్‌‌‌‌‌‌‌‌ను పరిశీలించడానికి మాత్రం రిక్వెస్ట్‌‌‌‌‌‌‌‌ పెట్టుకోవాల్సి ఉంటుంది. 
అప్లికేషన్‌‌‌‌‌‌‌‌ను సబ్మిట్ చేసినప్పటి నుంచి 48 నెలల్లోపు ఫామ్‌‌‌‌‌‌‌‌ 48 కింద రిక్వెస్ట్ పెట్టుకోవాలి.  ఆ తర్వాత పేటెంట్‌‌‌‌‌‌‌‌ను పరీక్షించే ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  పేటెంట్‌‌‌‌‌‌‌‌ పొందడానికి ఇన్వెన్షన్‌‌‌‌‌‌‌‌ సరియైనదా? కాదా? అనే విషయాన్ని పరిశీలిస్తారు.  అప్లికెంట్‌‌‌‌‌‌‌‌కు ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఎగ్జామినేషన్‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్ (ఎఫ్‌‌‌‌‌‌‌‌ఈఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ను అందిస్తారు. ఈ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌ అంతా వేగంగా 
జరగాలంటే ఫామ్‌‌‌‌‌‌‌‌ 18 ఏ కింద అప్లికేషన్‌‌‌‌‌‌‌‌ పెట్టుకోవచ్చు. 

ఎంక్వైరీలు ఉంటే..

పేటెంట్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ నుంచి ఎవైనా ఎంక్వైరీలు వస్తే అప్లికెంట్‌‌‌‌‌‌‌‌ స్పందించాల్సి ఉంటుంది. ఎఫ్‌‌‌‌‌‌‌‌ఈఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లేవనెత్తిన అభ్యంతరాలకు అప్లికెంట్   రాతపూర్వకంగా రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. పేటెంట్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ లేవనెత్తిన అభ్యంతరాలు క్లియర్ చేసిన తర్వాత  పేటెంట్ అప్లికేషన్‌‌‌‌‌‌‌‌ను  ‘గ్రాంట్‌‌‌‌‌‌‌‌’ కు పంపిస్తారు. అన్ని పేటెంట్ రూల్స్‌‌‌‌‌‌‌‌ను చేరుకుంటే  ఆ అప్లికేషన్‌‌‌‌‌‌‌‌కు పేటెంట్‌‌‌‌‌‌‌‌ ఇస్తారు. ఎదైనా ఇన్వెన్షన్‌‌‌‌‌‌‌‌కు పేటెంట్ దక్కాక ఎవరైనా ఈ పేటెంట్‌‌‌‌‌‌‌‌ను వ్యతిరేకిస్తే 12 నెలల్లోపు అభ్యంతరాలను వివరిస్తూ నోటీస్‌‌‌‌‌‌‌‌ను సబ్మిట్ చేయొచ్చు. దీనిపై దర్యాప్తు చేస్తారు.