దేశ సంపాదనలో 30శాతం MSMEల నుంచే వస్తోంది

 దేశ సంపాదనలో 30శాతం MSMEల నుంచే వస్తోంది

దేశ సంపాదనలో 30శాతం MSMEల నుంచే వస్తోందని  ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలోని ప్రతీ జిల్లాలో స్థానిక ఉత్పత్తిని ప్రపంచవ్యాప్తం చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అత్యుత్తమ పనితీరు కనబరచిన MSMEలకు ఆయన అవార్డ్స్ అందించారు. MSME రంగాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రం దృష్టి పెట్టిందని.. వాణిజ్యం, సాంకేతికత, పర్యాటకం దేశానికి మూడు పిల్లర్స్ లాంటివన్నారు ప్రధాని. 18వేల MSMEలకు 500కోట్లకు పైగా డిజిటల్ గా బదిలీ చేయబడ్డాయని తెలిపారు. 

200కోట్ల వరకు ఆర్డర్స్ ను.. గ్లోబల్ టెండర్లు పిలవొద్దని.. స్థానికులకే చెందేలా తాము నిర్ణయం తీసుకున్నామన్నారు. GeM పోర్టల్ లో ప్రతీ ఒక్కరూ రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో ర్యాంప్ స్కీమ్ తో పాటు.. MSME ఎక్స్ పోర్ట్స్ సామర్థ్యం పెంపు, పీఎం ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం కొత్త ఫీచర్స్ ను మోడీ ప్రారంభించారు.